Nalgonda: సీనియర్ జర్నలిస్ట్ మారబోయిన మధుసూదన్ కన్నుమూత!
Nalgonda: నల్లగొండ జిల్లా: సీనియర్ జర్నలిస్ట్, ఉప ముఖ్యమంత్రి సిపిఆర్వో మారబోయిన మధుసూదన్ మృతి.
Nalgonda: సీనియర్ జర్నలిస్ట్ మారబోయిన మధుసూదన్ కన్నుమూత!
Nalgonda: ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క సీపీఆర్వో మారబోయిన మధుసూదన్ గుండెపోటుతో హఠాన్మరణం చెందడం పట్ల పలువురు ప్రముఖులు తీవ్ర సంతాపం వ్యక్తం చేశారు. మంగళవారం మిర్యాలగూడలోని ఆయన నివాసంలో మధుసూదన్ పార్థివదేహానికి రాష్ట్ర రోడ్లు, భవనాల శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి, శాసనమండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ప్రభుత్వ విప్ వేముల వీరేశం, స్థానిక ఎమ్మెల్యే బత్తుల లక్ష్మారెడ్డి, ఎమ్మెల్సీ శంకర్ నాయక్, డీసీసీ అధ్యక్షుడు పున్న కైలాష్ నేత తదితరులు మృతుని కుటుంబ సభ్యులను పరామర్శించి, తమ ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు. ఉమ్మడి జిల్లా రాజకీయాల్లో మధుసూదన్ సేవలు చిరస్మరణీయమని ఈ సందర్భంగా నేతలు కొనియాడారు.
Next Story




