Shaligowraram: మాజీ సర్పంచ్ అంబటి అంజయ్య అంతిమయాత్రలో విప్ వీరేశం
Shaligowraram: రోడ్డు ప్రమాదంలో మృతి చెందిన ఇటికలపాడు మాజీ సర్పంచ్ అంబటి అంజయ్య అంతిమయాత్రలో ప్రభుత్వ విప్ వేముల వీరేశం పాల్గొని నివాళులర్పించారు.
Shaligowraram: మాజీ సర్పంచ్ అంబటి అంజయ్య అంతిమయాత్రలో విప్ వీరేశం
శాలిగౌరారం: తుంగతుర్తి నియోజకవర్గం శాలిగౌరారం మండలం ఇటికలపాడు గ్రామ మాజీ సర్పంచ్ అంబటి అంజయ్య రోడ్డు ప్రమాదంలో మృతి చెందగా, వారి అంతిమయాత్రలో ప్రభుత్వ విప్, నకిరేకల్ ఎమ్మెల్యే వేముల వీరేశం పాల్గొని నివాళులు అర్పించారు.
ఈ సందర్భంగా మృతుని కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలియజేసి, ధైర్యంగా ఉండాలని, కుటుంబానికి అండగా ఉంటామని భరోసా ఇచ్చారు. ఈ కార్యక్రమంలో స్థానిక నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.




