Huzurnagar: విద్యార్థుల సౌకర్యార్థం 50 కుర్చీల విరాళం ఇచ్చిన ఎస్‌ఐ కిషోర్!

Huzurnagar: దివంగత మామిడి దీపక్ జన్మదినం సందర్భంగా ఎస్‌ఐ మామిడి కిషోర్ హుజూర్‌నగర్ 15వ వార్డు యూపీఎస్ పాఠశాల నంబర్-1 విద్యార్థులకు 50 కుర్చీలు విరాళంగా ఇచ్చారు.

DONTHAGANI RAJA RAMESH, HUZUR NAGAR
Published on: 17 Nov 2026 2:05 PM IST
Huzurnagar
X

Huzurnagar: విద్యార్థుల సౌకర్యార్థం 50 కుర్చీల విరాళం ఇచ్చిన ఎస్‌ఐ కిషోర్!

హుజూర్‌నగర్: విద్యార్థుల విద్యాభివృద్ధికి, ప్రభుత్వ పాఠశాలల్లో మెరుగైన సౌకర్యాల కల్పనకు ప్రతి ఒక్కరూ తమ వంతు సహకారం అందించాలని పలువురు పిలుపునిచ్చారు. ఈ క్రమంలో దివంగత మామిడి దీపక్ జన్మదినాన్ని పురస్కరించుకుని ఆయన సోదరుడు ఎస్‌ఐ మామిడి కిషోర్ మానవతా దృక్పథంతో ముందుకొచ్చారు.

హుజూర్‌నగర్ పట్టణంలోని 15వ వార్డు పరిధిలో ఉన్న స్థానిక యూపీఎస్ పాఠశాల నంబర్‌-1 విద్యార్థుల సౌకర్యార్థం తన సొంత ఖర్చులతో 50 కుర్చీలను పాఠశాలకు విరాళంగా అందజేశారు. విద్యార్థులు సౌకర్యవంతంగా కూర్చొని చదువుకునేందుకు ఈ కుర్చీలు ఎంతగానో ఉపయోగపడనున్నాయి.

ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా 14వ వార్డు కౌన్సిలర్ దగ్గుపాటి కవిత బాబురావు, 15వ వార్డు కౌన్సిలర్ నల్లగొండ సుజాత శ్రీనాథ్ (చంటి) హాజరయ్యారు. ఈ సందర్భంగా వారు ఎస్‌ఐ మామిడి కిషోర్ సేవాభావాన్ని అభినందిస్తూ, ప్రభుత్వ పాఠశాలల అభివృద్ధికి, విద్యార్థుల సంక్షేమానికి ఇలాంటి దాతలు ముందుకు రావడం అభినందనీయమని పేర్కొన్నారు.

ఈ కార్యక్రమంలో పాఠశాల హెచ్‌ఎం జి. రామతారక, ఉపాధ్యాయులు షర్మిల, కళావతి, అటెండర్ కుమారి, తిలక్ నగర్ అంబేద్కర్ అసోసియేషన్ అధ్యక్షుడు మామిడి వసంత్, మామిడి రాకేష్, కొల్లపూడి అఖిల్, మామిడి నవీన్, కుడితోట్టి విజయ్, కుడితోట్టి మధు, దుంపల రమేష్, కొల్లపూడి కిట్టు, కుడితోట్టి దీక్షిత్, విద్యార్థులు, స్థానిక ప్రజలు తదితరులు పాల్గొన్నారు.

DONTHAGANI RAJA RAMESH, HUZUR NAGAR

DONTHAGANI RAJA RAMESH, HUZUR NAGAR