Shaligouraram: మంటలతో పెను ప్రమాదం రంగంలోకి దిగిన శాలిగౌరారం పోలీసులు

Shaligouraram: నల్గొండ జిల్లా శాలిగౌరారం పోలీస్ స్టేషన్ సమీపంలోని పొలాల్లో వరి కొయ్యలకు పెట్టిన మంటలు స్టేషన్, మార్కెట్ యార్డు వైపు దూసుకొచ్చాయి.

BHUPATHI GOPI, NAKREKAL
Published on: 21 May 2026 2:36 PM IST
Shaligouraram
X

Shaligouraram: మంటలతో పెను ప్రమాదం రంగంలోకి దిగిన శాలిగౌరారం పోలీసులు

శాలిగౌరారం: అగ్ని ప్రమాదం చోటుచేసుకుంది. శాలిగౌరారం పోలీస్ స్టేషన్‌కు కూతవేటు దూరంలోని పొలాల్లో గుర్తు తెలియని వ్యక్తులు వరి కొయ్యకు నిప్పు పెట్టడంతో మంటలు భారీగా చెలరేగాయి. మంటలు పోలీస్ స్టేషన్ వైపు వ్యాపిస్తుండడాన్ని గమనించిన SI సైదులు మరియు తన పోలీసు సిబ్బంది, స్థానిక రైతులతో కలిసి వెంటనే మంటలను అదుపులోకి తెచ్చారు. దీంతో పోలీస్ స్టేషనకు రైతుల గడ్డి వాములుకు , పక్కనే ఉన్న వ్యవసాయ మార్కెట్‌కు పెను ప్రమాదం తప్పింది. దయచేసి వేసవికాలంలో రైతులు పంట పొలాల్లోని కొయ్య కాళ్లకు నిప్పు పెట్టొద్దని SI సైదులు కోరారు.

BHUPATHI GOPI, NAKREKAL

BHUPATHI GOPI, NAKREKAL

Next Story