Thungathurthi: మద్దిరాలలో స్మార్ట్ రేషన్ కార్డుల పంపిణీ!
Thungathurthi: నియోజకవర్గం మద్దిరాలలో నూతన స్మార్ట్ రేషన్ కార్డుల పంపిణీ కార్యక్రమం ఘనంగా జరిగింది. అర్హులైన లబ్ధిదారులకు కార్డులను అందజేసిన కాంగ్రెస్ నాయకులు.
Thungathurthi: మద్దిరాలలో స్మార్ట్ రేషన్ కార్డుల పంపిణీ!
Thungathurthi: ప్రజా పాలన ప్రభుత్వ ప్రతిష్టాత్మక కార్యక్రమంలో భాగంగా నూతన స్మార్ట్ రేషన్ కార్డుల పంపిణీ కార్యక్రమాన్ని మద్దిరాల మండల కేంద్రంలో ఘనంగా నిర్వహించారు. తుంగతుర్తి నియోజకవర్గ ఎమ్మెల్యే మందుల సామేలు ఆదేశాల మేరకు మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు పచ్చిపాల వెంకన్న యాదవ్ ఆధ్వర్యంలో అర్హులైన లబ్ధిదారులకు స్మార్ట్ రేషన్ కార్డులను పంపిణీ చేశారు.
ఈ కార్యక్రమంలో మండల సేవాదళ్ అధ్యక్షుడు వల్లపు రమేష్ యాదవ్, కాంగ్రెస్ పార్టీ ఉప సర్పంచ్ కసనబోయిన లింగమ్మ, వార్డు సభ్యులు, యూత్ కాంగ్రెస్ వైస్ ప్రెసిడెంట్ దండంపల్లి ఉమేష్, భాష బోయిన నాగయ్య, PACS మెంబర్ మట్టిపల్లి లింగయ్య, మేడుదుల అనిల్, సాయి, బత్తుల ఏసోబు, పగిండ్ల మల్లయ్య, గణేష్ తదితరులు పాల్గొన్నారు.
ఈ సందర్భంగా మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు పచ్చిపాల వెంకన్న యాదవ్ మాట్లాడుతూ.. ప్రజా పాలనలో ప్రతి అర్హమైన కుటుంబానికి ప్రభుత్వ సంక్షేమ పథకాల ప్రయోజనాలు అందేలా ప్రభుత్వం చర్యలు తీసుకుంటోందన్నారు. నూతన స్మార్ట్ రేషన్ కార్డుల ద్వారా రేషన్ సరుకులతో పాటు ఇతర ప్రభుత్వ సంక్షేమ పథకాల ప్రయోజనాలను అర్హులకు మరింత పారదర్శకంగా అందించేందుకు అవకాశం ఉంటుందని తెలిపారు.
పేద, అర్హులైన కుటుంబాలకు ప్రభుత్వ సంక్షేమ ఫలాలు అందించడమే ప్రజా పాలన ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని పేర్కొన్నారు. ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ కార్యక్రమాలను ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, ప్రజాప్రతినిధులు, అధికారులు, గ్రామ పెద్దలు, లబ్ధిదారులు, ప్రజలు పాల్గొన్నారు.




