Tungaturthi: చందుపట్ల గ్రామంలో ఘనంగా స్మార్ట్ రేషన్ కార్డుల పంపిణీ

Tungaturthi: తుంగతుర్తి నియోజకవర్గం మద్దిరాల మండలం చందుపట్ల గ్రామంలో అర్హులైన కుటుంబాలకు నూతన స్మార్ట్ రేషన్ కార్డులను ఘనంగా పంపిణీ చేశారు.

Muragundla, Veeraiah, Tungathurthy
Published on: 5 Sept 2026 9:17 PM IST
Tungaturthi
X

Tungaturthi: చందుపట్ల గ్రామంలో ఘనంగా స్మార్ట్ రేషన్ కార్డుల పంపిణీ

Tungaturthi: తుంగతుర్తి నియోజకవర్గం మద్దిరాల మండలం: తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నేతృత్వంలోని ప్రజాపాలనలో భాగంగా ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన నూతన స్మార్ట్ రేషన్ కార్డుల పంపిణీ కార్యక్రమం చందుపట్ల గ్రామంలో ఘనంగా నిర్వహించారు.

తుంగతుర్తి శాసనసభ్యులు మందుల సామేలు ఆదేశాల మేరకు అర్హులైన కుటుంబాలకు స్మార్ట్ రేషన్ కార్డులను పంపిణీ చేశారు. అర్హులైన ప్రతి కుటుంబానికి ప్రభుత్వ సంక్షేమ పథకాలు అందేలా కాంగ్రెస్ పార్టీ నాయకులు, ప్రజాప్రతినిధులు కృషి చేస్తున్నారని తెలిపారు.

ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ మండల పార్టీ అధ్యక్షులు పచ్చిపాల వెంకన్న యాదవ్, కాంగ్రెస్ పార్టీ మాజీ సర్పంచ్, శ్రీనివాస్ రెడ్డి, చందుపట్ల గ్రామ సర్పంచ్ కర్ణాకర్, గ్రామ శాఖ అధ్యక్షులు తీకుల సుధాకర్ రెడ్డి, ఉప సర్పంచ్ జాల వీరన్న, కాంగ్రెస్ నాయకులు వాసిరెడ్డి శ్రీనివాసరెడ్డి, వార్డు సభ్యులు పరాల ముత్తయ్య, రంగు హేమలత, కొమ్ము వెంకన్న, జిల్లా కాంగ్రెస్ నాయకులు కొమ్ము అంజయ్య, భువనగిరి నర్సయ్య, గణేష్ గౌడ్, చర్ల శేఖర్, రెడ్డిగూడెం గ్రామ సర్పంచ్ తీగల వెంకన్న, ఉపేంద్ర, గోరంట్ల సర్పంచ్ అంగిరేకుల రామ్మూర్తి, మండల సేవాదళ అధ్యక్షులు వల్లపు రమేష్ యాదవ్, రెడ్డిగూడెం గ్రామ శాఖ అధ్యక్షులు దగ్గుల మల్లయ్య యాదవ్, వ్యవసాయ మాజీ డైరెక్టర్ ఉబ్బని రఘుపతి, కొత్తపెళ్లి మండల కాంగ్రెస్ నాయకులు పులిగిల్ల లింగన్న, జిల్లా నాయకులు పాల్వాయి పరశురాములు, భూతం లింగరాజు, భూతం లింగయ్య తదితరులు పాల్గొన్నారు.

స్మార్ట్ రేషన్ కార్డుల పంపిణీ సందర్భంగా గ్రామ ప్రజలు అధిక సంఖ్యలో పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేశారు. ప్రభుత్వం అందిస్తున్న సంక్షేమ పథకాలు అర్హులైన ప్రతి కుటుంబానికి చేరేలా సమన్వయంతో పనిచేస్తామని నాయకులు తెలిపారు.

Muragundla, Veeraiah, Tungathurthy

Muragundla, Veeraiah, Tungathurthy

Next Story