Miryalaguda: 1200 మంది అయ్యప్ప స్వాములకు ప్రత్యేక రైలు!

Miryalaguda: మిర్యాలగూడకు చెందిన సామాజికవేత్త మిట్టపల్లి వెంకటేష్ శబరిమల యాత్ర కోసం 1200 మంది అయ్యప్ప స్వాములకు సొంత ఖర్చుతో ప్రత్యేక రైలు ఏర్పాటు చేశారు.

SHAIK VASIM, MIRYALAGUDA
Published on: 19 Nov 2026 11:19 AM IST
Miryalaguda
X

Miryalaguda: 1200 మంది అయ్యప్ప స్వాములకు ప్రత్యేక రైలు!

Miryalaguda: నల్గొండ జిల్లా మిర్యాలగూడ పట్టణంలో అయ్యప్ప స్వామిపై భక్తితో.. ఏకంగా 1200 మంది అయ్యప్ప స్వాముల ఇరుముడి యాత్ర కోసం ప్రత్యేక రైలునే బుక్ చేశారు మిర్యాలగూడకు చెందిన సామాజికవేత్త మిట్టపల్లి వెంకటేష్..! యాత్రలో స్వాములు ఎలాంటి ఇబ్బందులు పడకూడదనే సంకల్పంతో తన సొంత ఖర్చుతో ఈ ఏర్పాటుకు శ్రీకారం చుట్టారు.

1200 మంది అయ్యప్ప స్వాములు ఒకే రైలులో భక్తి మార్గంలో శబరికి ప్రయాణం..! స్వాముల యాత్ర సాఫీగా సాగాలనే ఉద్దేశంతో వెంకటేష్ తీసుకున్న ఈ నిర్ణయం ప్రత్యేకంగా నిలుస్తోంది.

అంతేకాదు.. దీక్షా స్వాములకు అన్నదానం, అయ్యప్ప కొండకు బయలుదేరే స్వాములకు తన వంతు సహాయం అందించేందుకు ముందుకొచ్చారు. గతంలో వినాయక చవితి వేడుకల్లో విగ్రహాల పంపిణీ, అన్నదాన కార్యక్రమాలతో పాటు పలు సేవా కార్యక్రమాలు చేపడుతూ తన సేవా గుణాన్ని చాటుకున్న వెంకటేష్ మరోసారి భక్తి, సేవా భావంతో ముందుకొచ్చారు.

ఈ సేవా కార్యక్రమాలకు మిర్యాలగూడ పట్టణ ప్రజల ఆశీర్వాదాలు ఎల్లప్పుడూ ఉండాలని, ఆ అయ్యప్ప స్వామి దీవెనలు అందరిపై ఉండాలని ఆయన ఆకాంక్షించారు.

SHAIK VASIM, MIRYALAGUDA

SHAIK VASIM, MIRYALAGUDA