Suryapet: పోలీసు కుటుంబాలకు అండగా 'పోలీసు భద్రత స్కీం': ఎస్పీ కె. నరసింహ
Suryapet: పోలీస్ స్టేషన్‌లో పనిచేస్తూ అకాల మరణం చెందిన హెడ్ కానిస్టేబుల్ యాదగిరి కుటుంబానికి పోలీసు భద్రత స్కీం కింద మంజూరైన చెక్కును జిల్లా ఎస్పీ అందజేశారు.
Suryapet: పోలీసు కుటుంబాలకు అండగా 'పోలీసు భద్రత స్కీం': ఎస్పీ కె. నరసింహ
సూర్యాపేట: పోలీసు శాఖలో విధులు నిర్వహిస్తూ ఆకస్మికంగా మృతి చెందిన సిబ్బంది కుటుంబాల సంక్షేమానికి ప్రభుత్వం అమలు చేస్తున్న పోలీసు భద్రత స్కీం అండగా నిలుస్తుందని జిల్లా ఎస్పీ కె. నరసింహ ఐపీఎస్ అన్నారు.
సూర్యాపేట జిల్లా పెన్‌పహాడ్ పోలీస్ స్టేషన్‌లో హెడ్ కానిస్టేబుల్‌గా పనిచేస్తూ ఇటీవల ఆకాల మరణం చెందిన యాదగిరి కుటుంబానికి పోలీసు భద్రత స్కీం కింద మంజూరైన నగదు చెక్కును సోమవారం జిల్లా పోలీసు కార్యాలయంలో ఎస్పీ నరసింహ కుటుంబ సభ్యులకు అందజేశారు.
ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ, పోలీసు శాఖలో పనిచేస్తూ ప్రాణాలు కోల్పోయిన సిబ్బంది కుటుంబాలను ప్రభుత్వం, పోలీసు శాఖ అన్ని విధాలుగా ఆదుకుంటుందని తెలిపారు. పోలీసు భద్రత స్కీం ద్వారా దివంగత సిబ్బంది కుటుంబాలకు ఆర్థిక భరోసా లభిస్తుందని, యాదగిరి కుటుంబ సంక్షేమానికి తమ వంతు కృషి చేస్తామని హామీ ఇచ్చారు.
ఈ కార్యక్రమంలో అదనపు ఎస్పీ రవీందర్ రెడ్డి, డీఎస్పీ రవి, జిల్లా పోలీసు కార్యాలయ అడ్మినిస్ట్రేషన్ అధికారి మంజు భార్గవి, పోలీసు సంఘం అధ్యక్షులు ఎస్సై రామచందర్ గౌడ్ తో పాటు ఇతర సిబ్బంది పాల్గొన్నారు.




