Suryapet: రౌడీ షీటర్లకు పోలీసుల కౌన్సిలింగ్ మంచిగా ఉంటేనే షీట్లు ఎత్తివేత

Suryapet: సూర్యాపేట టౌన్ పోలీస్ స్టేషన్‌లో రౌడీ షీటర్లు, గంజాయి కేస్ నిందితులకు జిల్లా ఎస్పీ నరసింహ ఐపీఎస్ కౌన్సిలింగ్ నిర్వహించారు.

PULUSU NAGARAJU, SURYAPETA
Published on: 19 May 2026 3:10 PM IST
Suryapet
X

Suryapet: రౌడీ షీటర్లకు పోలీసుల కౌన్సిలింగ్ మంచిగా ఉంటేనే షీట్లు ఎత్తివేత

సూర్యాపేట: సూర్యాపేట పట్టణ పోలీస్ స్టేషన్‌లో సోమవారం డివిజన్ స్థాయి కౌన్సిలింగ్ కార్యక్రమం నిర్వహించారు. కేసుల్లో సస్పెక్ట్ షీట్స్, హిస్టరీ షీట్స్, గంజాయి కేసుల్లో షీట్స్ ఉన్న వ్యక్తులకు ఈ కౌన్సిలింగ్ నిర్వహించారు. ఈ కార్యక్రమానికి జిల్లా ఎస్పీ నరసింహ ఐపీఎస్ ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. గతంలో చేసిన తప్పుల నుంచి పాఠాలు నేర్చుకుని సత్ప్రవర్తనతో మెలగాలని సూచించారు. సమాజ హితానికి, మంచి పనులకు పాటుపడాలని పిలుపునిచ్చారు. అసాంఘిక చర్యలకు, నేరాలకు పాల్పడుతూ ప్రజా జీవనానికి భంగం కలిగిస్తే రౌడీ షీట్స్, సస్పెక్ట్ షీట్స్ నమోదు చేస్తామని హెచ్చరించారు. పదే పదే నేరాలకు పాల్పడే వారిపై పీడీ యాక్ట్ నమోదు చేసి జైలుకు పంపిస్తామని స్పష్టం చేశారు.

ప్రతి నెలా కౌన్సిలింగ్, నిఘా కొనసాగింపు

ప్రతి నెలా ఇలాంటి కౌన్సిలింగ్ కార్యక్రమాలు నిర్వహిస్తామని ఎస్పీ తెలిపారు. షీట్స్ ఉన్న వారందరిపై పోలీసు నిఘా ఉందని, ప్రస్తుత జీవన శైలి, పనులను గమనిస్తున్నామని అన్నారు. మంచి ప్రవర్తన కలిగి ఉంటే క్షుణ్ణంగా పరిశీలించి చట్టప్రకారం షీట్స్ ఎత్తివేస్తామని హామీ ఇచ్చారు.

కేసుల దర్యాప్తులో వేగం పెరిగింది

పోలీసు దర్యాప్తులో వేగం, నాణ్యత పెరిగిందని, పక్కా ఆధారాలతో కేసులను కోర్టులకు పంపుతున్నామని చెప్పారు. చట్టాన్ని ఉల్లంఘించి భౌతిక దాడులకు పాల్పడవద్దని కోరారు. కేసుల్లో త్వరితగతిన శిక్షలు అమలవుతున్నాయని, గరిడేపల్లి, మెళ్లచెరువు, మునగాల, మోతే పోలీస్ స్టేషన్ల పరిధిలోని హత్య కేసుల్లో నిందితులకు జీవిత ఖైదీ శిక్షలు పడ్డాయని గుర్తు చేశారు. ఈ కార్యక్రమంలో సూర్యాపేట డివిజన్ డీఎస్పీ ప్రసన్న కుమార్, పట్టణ ఇన్స్పెక్టర్ వెంకటయ్య, ఎస్ఐలు ఏడుకొండలు, సాయిరాం, శివతేజతో పాటు పోలీసు సిబ్బంది పాల్గొన్నారు.

PULUSU NAGARAJU, SURYAPETA

PULUSU NAGARAJU, SURYAPETA

Next Story