Suryapet: సూర్యాపేట బస్టాండ్, హాస్టళ్లలో యాంటీ నార్కోటిక్ సోదాలు..

Suryapet: సూర్యాపేటలో మాదకద్రవ్యాల నిర్మూలనకు పోలీసుల మెరుపు తనిఖీలు.

PULUSU NAGARAJU, SURYAPETA
Published on: 27 Jun 2026 8:23 PM IST
Suryapet
X

Suryapet: సూర్యాపేట బస్టాండ్, హాస్టళ్లలో యాంటీ నార్కోటిక్ సోదాలు..

సూర్యాపేట: జిల్లా కేంద్రంలో మాదకద్రవ్యాల నిర్మూలనలో భాగంగా పోలీసులు విస్తృత తనిఖీలు చేపట్టారు. జిల్లా ఎస్పీ నరసింహ, ఐపీఎస్ ఆదేశాల మేరకు పట్టణ పోలీసులు యాంటీ నార్కోటిక్ డాగ్ స్క్వాడ్‌తో కలిసి పలు ప్రాంతాల్లో సోదాలు నిర్వహించారు.

విద్యా నగర్, 60 ఫీట్ల రోడ్, బస్టాండ్ ప్రాంతాల్లోని టీ దుకాణాలు, పాన్ షాపులు, హోటళ్లు, లాడ్జిలు, హాస్టళ్లు, పాఠశాలల్లో తనిఖీలు జరిగాయి. ఈ తనిఖీల్లో యాంటీ నార్కోటిక్ డాగ్ 'రోలెక్స్' పాల్గొని అనుమానిత ప్రాంతాలు, వస్తువులను క్షుణ్ణంగా తనిఖీ చేసింది.

ఈ సందర్భంగా పట్టణ ఇన్స్పెక్టర్ మాట్లాడుతూ, రెండు తెలుగు రాష్ట్రాలను కలిపే ప్రధాన జాతీయ రహదారిపై ఉన్న సూర్యాపేట రవాణా పరంగా కీలకమైన ప్రాంతమని, ఇక్కడ మెరుగైన భద్రత కల్పించడం, డ్రగ్స్, గంజాయి వంటి మాదకద్రవ్యాల అక్రమ రవాణాను అరికట్టడమే లక్ష్యమని తెలిపారు. కొత్త వ్యక్తుల కదలికలను గుర్తించడం, నిషేధిత పదార్థాల సరఫరాను నిరోధించడంపై ప్రత్యేక దృష్టి సారించామని వెల్లడించారు.

మాదకద్రవ్యాల రహిత జిల్లాగా సూర్యాపేటను తీర్చిదిద్దేందుకు ఇలాంటి తనిఖీలు నిరంతరం కొనసాగుతాయని పోలీసులు స్పష్టం చేశారు.

PULUSU NAGARAJU, SURYAPETA

PULUSU NAGARAJU, SURYAPETA

Next Story