Nalgonda: కొండమల్లేపల్లి పీఎస్‌లో జిల్లా ఎస్పీ ఆకస్మిక తనిఖీ!

Nalgonda: పోలీస్ స్టేషన్‌ను ఆకస్మికంగా తనిఖీ చేసిన జిల్లా ఎస్పీ శరత్ చంద్ర పవార్. ఫిర్యాదులపై తక్షణమే స్పందించి బాధితులకు న్యాయం చేయాలని అధికారులకు ఆదేశం.

Saleem, Nalgonda
Published on: 13 Aug 2026 10:47 PM IST
Nalgonda
X

Nalgonda: కొండమల్లేపల్లి పీఎస్‌లో జిల్లా ఎస్పీ ఆకస్మిక తనిఖీ!

నల్గొండ: బాధితులకు త్వరితగతిన న్యాయం జరిగేలా పీఎస్‌కు వచ్చే ఫిర్యాదులపై తక్షణమే స్పందించాలని నల్గొండ జిల్లా ఎస్పీ శరత్ చంద్ర పవార్ అధికారులను ఆదేశించారు. గురువారం ఆయన మల్లేపల్లి పోలీస్ స్టేషన్‌ను ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా స్టేషన్ పరిసరాలు, వివిధ విభాగాలు, రికార్డులను క్షుణ్ణంగా పరిశీలించారు.

​అనంతరం దర్యాప్తులో ఉన్న కేసులు, పెండింగ్ ఫైళ్ల పురోగతిపై సిబ్బందితో సమీక్షించారు. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ... నేరాలకు పాల్పడే వారిపై చట్టపరంగా కఠిన చర్యలు తీసుకోవాలన్నారు.

Saleem, Nalgonda

Saleem, Nalgonda

Next Story