Nalgonda: జీజీహెచ్‌లో సిబ్బంది నిర్లక్ష్యం.. ఖాళీగా వార్డు కౌంటర్లు!
Nalgonda: నల్లగొండ ప్రభుత్వ సర్వజన ఆసుపత్రిలో సిబ్బంది నిర్లక్ష్యం బయటపడింది.
Nalgonda: జీజీహెచ్‌లో సిబ్బంది నిర్లక్ష్యం.. ఖాళీగా వార్డు కౌంటర్లు!
నల్లగొండ: నల్లగొండ ప్రభుత్వ సర్వజన ఆసుపత్రిలో సిబ్బంది నిర్లక్ష్యం మళ్లీ బయటపడింది. ఆసుపత్రిలోని ఫిమేల్ వార్డు-9 రిసెప్షన్ కౌంటర్ వద్ద ఒక్క నర్సు కూడా అందుబాటులో లేకపోవడంతో రోగులు, వారి బంధువులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. తీవ్రమైన విరేచనాల (మోషన్స్) సమస్యతో వార్డులో చేరిన ఓ మహిళా పేషెంట్‌కు తక్షణ చికిత్స అందించాల్సి ఉండగా, అత్యవసర సమయంలో పర్యవేక్షించేందుకు ఒక్క నర్సు కూడా అక్కడ లేకపోవడం గమనార్హం.
వార్డు రిసెప్షన్ వద్ద సిబ్బంది ఎవరూ లేక ఖాళీగా దర్శనమివ్వడంతో తమ రోగికి సకాలంలో వైద్యం అందడం లేదని ఆవేదన వ్యక్తం చేస్తూ రోగి బంధువులు ఆసుపత్రి యాజమాన్యం తీరుపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రాణాపాయ స్థితిలో ఆసుపత్రికి వస్తే, పట్టించుకునే నాథుడే కరువయ్యాడని రోగుల బంధువులు ఆరోపించారు. ఇప్పటికైనా ఉన్నతాధికారులు స్పందించి ఆసుపత్రి వార్డులలో సిబ్బంది బాధ్యతారాహిత్యంపై చర్యలు తీసుకోవాలని వారు డిమాండ్ చేస్తున్నారు.




