Miryalaguda: మిర్యాలగూడలో వృద్ధాప్య పెన్షన్ల కోసం సీపీఎం డిమాండ్!
Miryalaguda: మిర్యాలగూడలో సీపీఎం మండల కార్యదర్శి రవి నాయక్ మాట్లాడుతూ రాష్ట్రంలో అర్హులైన వృద్ధులందరికీ వెంటనే వృద్ధాప్య పెన్షన్లు ప్రారంభించాలని డిమాండ్ చేశారు.
Miryalaguda: మిర్యాలగూడలో వృద్ధాప్య పెన్షన్ల కోసం సీపీఎం డిమాండ్!
మిర్యాలగూడ: రాష్ట్రంలో అర్హులైన వృద్ధులకు వృద్ధాప్య పెన్షన్లు వెంటనే ప్రారంభించాలని సీపీఎం మండల కార్యదర్శి రవి నాయక్ రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. వృద్ధాప్య దశలో ఉన్న పేదలు, నిరుపేద కుటుంబాలకు పెన్షన్ ఎంతో ఆసరాగా ఉంటుందని తెలిపారు.
ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం దివ్యాంగులు, ఒంటరి మహిళ, గీత, చేనేత కార్మికులు, వితంతువులకు మాత్రమే పెన్షన్ ప్రక్రియను ప్రారంభించిందని వాటితో పాటు పెన్షన్ల కోసం ఎదురుచూస్తున్న వృద్ధులు అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని పేర్కొన్నారు. ప్రభుత్వం తక్షణమే స్పందించి అర్హులైన వృద్ధులందరికీ పెన్షన్లు మంజూరు చేసి, ప్రతి నెలా క్రమం తప్పకుండా అందించాలని కోరారు.
వృద్ధుల సంక్షేమాన్ని దృష్టిలో పెట్టుకొని పెన్షన్ల పంపిణీ ప్రక్రియను ఆలస్యం చేయకుండా వెంటనే అమలు చేయాలని ఆయన ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో సీపీఎం సీనియర్ నాయకులు పిల్లుట్ల సైదులు, కృష్ణయ్య పాల్గొన్నారు




