Nalgonda: హైదరాబాద్‌లో ఎఫ్‌పిఓ ప్రాముఖ్యతపై రాష్ట్ర స్థాయి సదస్సు!

Nalgonda: హైదరాబాద్‌లో నిర్వహించిన రాష్ట్ర స్థాయి FPO సదస్సుకు నల్గొండ పీఏసీఎస్ చైర్మన్ ఆలకుంట్ల నాగరత్నం రాజు, సీఈఓ అనంతరెడ్డి హాజరయ్యారు.

Saleem, Nalgonda
Published on: 3 Sept 2026 2:21 PM IST
Nalgonda
X

Nalgonda: హైదరాబాద్‌లో ఎఫ్‌పిఓ ప్రాముఖ్యతపై రాష్ట్ర స్థాయి సదస్సు!

Nalgonda: తెలంగాణ రాష్ట్ర రాజధాని హైదరాబాద్‌లో నిర్వహించిన రాష్ట్ర స్థాయి రైతు ఉత్పత్తిదారుల సంస్థల (FPO) ప్రాముఖ్యత, అభివృద్ధిపై ప్రత్యేక సదస్సు నిర్వహించారు. ఈ కార్యక్రమానికి నల్గొండ జిల్లా ప్రతినిధులుగా నల్గొండ పీఏసీఎస్ చైర్మన్ ఆలకుంట్ల నాగరత్నం రాజు, సీఈఓ అనంతరెడ్డి హాజరయ్యారు.

​వ్యవసాయ రంగంలో సహకార సంఘాల పాత్ర, రైతు ఉత్పత్తిదారుల సంస్థలను బలోపేతం చేయడం, వ్యవసాయ ఉత్పత్తులకు సరైన మద్దతు ధర మరియు మార్కెటింగ్ సౌకర్యాలు కల్పించడంపై ఈ సదస్సులో విస్తృతంగా చర్చించారు. రైతులకు ఆధునిక సాగు పద్ధతులు, సబ్సిడీ పథకాలు మరియు సాంకేతిక పరిజ్ఞానాన్ని వేగంగా చేరవేసేందుకు పీఏసీఎస్‌లు క్రియాశీలకంగా వ్యవహరించాలని సమావేశంలో పిలుపునిచ్చారు.

Saleem, Nalgonda

Saleem, Nalgonda

Next Story