Suryapet: సూర్యాపేట జిల్లాలో వీధికుక్కల బీభత్సం: 11 గొర్రె పిల్లలు మృతి
Suryapet: సూర్యాపేట జిల్లా మునగాల మండలం నారాయణగూడెంలో వీధికుక్కల దాడి. 11 గొర్రె పిల్లలు మృతి, రూ.1.50 లక్షల నష్టం. తీవ్ర ఆందోళనలో గ్రామస్థులు.
Suryapet: సూర్యాపేట జిల్లాలో వీధికుక్కల బీభత్సం: 11 గొర్రె పిల్లలు మృతి
Suryapet: సూర్యాపేట జిల్లా మునగాల మండలం నారాయణగూడెం గ్రామంలో వీధి కుక్కలు బీభత్సం సృష్టించాయి. గ్రామానికి చెందిన దాసరి రామకృష్ణ అనే గొర్రెల కాపరి తన జీవాల కొట్టంలో ఉంచిన గొర్రెల మందపై వీధి కుక్కలు దాడి చేశాయి. ఈ ఘటనలో ఏకంగా 11 గొర్రె పిల్లలు మృతి చెందాయి.
దీంతో తనకు సుమారు రూ. 1.50 లక్షల నష్టం వాటిల్లిందని బాధితుడు రామకృష్ణ ఆవేదన వ్యక్తం చేశారు. గ్రామంలో వీధి కుక్కల బెడద విపరీతంగా పెరిగిపోయిందని, పంచాయతీ పాలకవర్గం వెంటనే స్పందించి కుక్కల నియంత్రణకు చర్యలు తీసుకోవాలని ఆయన డిమాండ్ చేశారు. లేదంటే రాబోయే రోజుల్లో చిన్నపిల్లలు, పాదచారులు, ఇతర పశువులపై కూడా దాడులు జరిగే ప్రమాదం ఉందని గ్రామస్థులు ఆందోళన చెందుతున్నారు.
Next Story




