Halia: వీధుల్లో గుంపులుగా తిరుగుతున్న కుక్కలతో బెంబేలెత్తుతున్న చిన్నారులు!
Halia: నల్గొండ జిల్లా హాలియా మున్సిపాలిటీ పరిధిలో విచ్చలవిడిగా తిరుగుతున్న పిచ్చి కుక్కలు. బయటకు వెళ్లాలంటేనే భయపడుతున్న కాలనీవాసులు, చిన్నారుల తల్లిదండ్రులు.
Halia: వీధుల్లో గుంపులుగా తిరుగుతున్న కుక్కలతో బెంబేలెత్తుతున్న చిన్నారులు!
Halia: హాలియా మున్సిపాలిటీ పరిధిలోని అనన్య గ్రీటింగ్ కమ్యూనిటీలో పిచ్చికుక్కల బెడద తీవ్రరూపం దాల్చింది. కాలనీ వీధుల్లో గుంపులు గుంపులుగా తిరుగుతూ స్వైరవిహారం చేస్తున్నాయి. ముఖ్యంగా పాఠశాలలకు సెలవు రోజులు కావడంతో ఇళ్ల ముందు ఆడుకోవడానికి రావాలన్నా చిన్నారులు భయపడిపోతున్నారు. ఎప్పుడు ఏ కుక్క దాడి చేస్తుందోనని స్థానికులు, తల్లిదండ్రులు ఆందోళన చెందుతున్నారు. ఇప్పటికైనా మున్సిపల్ అధికారులు వెంటనే స్పందించి, కాలనీలో సంచరిస్తున్న కుక్కలను పట్టుకెళ్లి తగిన చర్యలు తీసుకోవాలని కాలనీవాసులు విజ్ఞప్తి చేస్తున్నారు.




