Suryapet: సూర్యాపేట జిల్లాలో కలకలం: 13 రోజుల్లో ఆరుగురు మృతి!

Suryapet: సూర్యాపేట జిల్లా వెలిశాల గ్రామంలో 13 రోజుల వ్యవధిలో ఆరుగురు గ్రామస్థులు మృతి చెందడంతో గ్రామస్థుల్లో తీవ్ర భయాందోళనలు నెలకొన్నాయి.

Saleem, Nalgonda
Published on: 27 Sept 2026 7:56 AM IST
Suryapet
X

Suryapet: సూర్యాపేట జిల్లాలో కలకలం: 13 రోజుల్లో ఆరుగురు మృతి!

Suryapet: సూర్యాపేట జిల్లా తిరుమలగిరి మండలం వెలిశాల గ్రామాన్ని వరుస మరణాలు భయాందోళనకు గురిచేస్తున్నాయి. కేవలం 13 రోజుల వ్యవధిలోనే వేర్వేరు కారణాలతో ఆరుగురు గ్రామస్థులు మృతిచెందడంతో స్థానికులు తీవ్ర దిగ్భ్రాంతికి లోనవుతున్నారు.

గ్రామానికి చెందిన జనగాం వెంకన్న ఈ నెల 14న మృతిచెందగా.. ఏపూరి వెంకటనర్సయ్య 16న, పుల్లూరి జల్లయ్య, కాశి అర్వపల్లి ఈ నెల 18న కన్నుమూశారు. అదేవిధంగా దండిగ గణేశ్ 25న, ఏపూరి బుచ్చి రామక్క శుక్రవారం (26న) మరణించారు.

స్వల్ప వ్యవధిలోనే గ్రామానికి చెందిన ఆరుగురు వరుసగా ప్రాణాలు కోల్పోవడంతో వెలిశాలలో శోకఛాయలు అలముకున్నాయి. ఏం జరుగుతోందో తెలియక భయంతో గ్రామస్థులు బెంబేలెత్తుతున్నారు. అధికారులు స్పందించి తగిన చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు.

Saleem, Nalgonda

Saleem, Nalgonda