Suryapet: వ్యాపారస్తులను బెదిరిస్తే సహించేది లేదు.. రాంరెడ్డి సర్వోత్తమ్ రెడ్డి వార్నింగ్!
Suryapet: సూర్యాపేటలో వ్యాపారస్తులకు అండగా ఉంటామని ఏఐసీసీ సభ్యులు రాంరెడ్డి సర్వోత్తమ్ రెడ్డి హామీ.
Suryapet: వ్యాపారస్తులను బెదిరిస్తే సహించేది లేదు.. రాంరెడ్డి సర్వోత్తమ్ రెడ్డి వార్నింగ్!
సూర్యాపేట: సూర్యాపేట పట్టణంలో శాంతిభద్రతల పరిరక్షణకే తాను మొదటి ప్రాధాన్యత ఇస్తానని ఎఐసిసి సభ్యులు రాంరెడ్డి సర్వోత్తమ్ రెడ్డి అన్నారు. వ్యాపారస్తులకు ఎల్లప్పుడూ అండగా ఉంటానని హామీ ఇచ్చారు.
శుక్రవారం రాత్రి సూర్యాపేట ఆర్యవైశ్య సంఘం పట్టణ అధ్యక్షులు బెలిదె శ్రీనివాసులు, జిల్లా కాంగ్రెస్ నాయకులు మొరిశెట్టి లక్షాదితో కలిసి ఆయనను, కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర నాయకులు పోతు భాస్కర్‌ను మర్యాదపూర్వకంగా కలిశారు.
ఈ సందర్భంగా రాంరెడ్డి సర్వోత్తమ్ రెడ్డి మాట్లాడుతూ, కుల సంఘాలు, అసోసియేషన్ల ఎన్నికల్లో తాను ఎప్పుడూ జోక్యం చేసుకోనని స్పష్టం చేశారు. ఎన్నికలు ప్రజాస్వామ్య పద్ధతిలో, ప్రజలు ఇష్టప్రకారం ఓటు వేసి గెలిపించినప్పుడే నిజమైన ప్రజాస్వామ్యం గెలుస్తుందన్నారు.
"వ్యాపారస్తులను బెదిరిస్తే సహించను"
పట్టణంలో ఎవరైనా వ్యాపారస్తులను బెదిరిస్తే తాను సహించబోనని, అలాంటి వారిపై కఠినంగా వ్యవహరిస్తానని హెచ్చరించారు. ప్రతి ఒక్కరూ స్వేచ్ఛగా వ్యాపారాలు చేసుకునేలా సూర్యాపేటలో ప్రశాంత వాతావరణం కల్పించడానికి ఎల్లప్పుడూ కృషి చేస్తానని తెలిపారు.
ఆర్యవైశ్య సంఘం నాయకులు గతంలో కేటాయించిన స్థలం గురించి అడగగా, మాజీ మంత్రి జగదీశ్ రెడ్డి అనేక కుల సంఘాలకు స్థలాలు ఇస్తున్నట్లు శంకుస్థాపన చేసినా అవి ప్రభుత్వ రికార్డుల్లో నమోదు కాలేదని చెప్పారు. రికార్డుల్లో నమోదైతే తప్పకుండా సహాయం చేస్తానని హామీ ఇచ్చారు.
ఈ కార్యక్రమంలో మార్కెట్ కమిటీ డైరెక్టర్ ఉప్పల సత్యనారాయణ, కాంగ్రెస్ నాయకులు రాచకొండ శ్రీనివాస్, బిక్కుమళ్ల కృష్ణ, జూలకంటి నాగరాజు, సుమన్ వెంకన్న, మిట్టపల్లి రమేష్, బోనగిరి కృష్ణ, డోగుపర్తి ప్రవీణ్, కుంచపర్తి రాజశేఖర్, సోమ ప్రవీణ్, రాచర్ల సత్యం, బెలిదె శ్రీనాధ్, కంది బండ నాగేశ్వరావు తదితరులు పాల్గొన్నారు.




