Suryapet: మినీ గురుకుల అకౌంటెంట్ పోస్టు భర్తీలో అక్రమాలు కలెక్టర్‌కు ఫిర్యాదు
Suryapet: చివ్వెంల గిరిజన మినీ గురుకులంలో అకౌంటెంట్ పోస్టు భర్తీలో అవకతవకలు. జిల్లా ఆర్సీవోపై బాధితురాలు బానోత్ యశోద సూర్యాపేట కలెక్టర్‌కు ఫిర్యాదు.
Suryapet: మినీ గురుకుల అకౌంటెంట్ పోస్టు భర్తీలో అక్రమాలు కలెక్టర్‌కు ఫిర్యాదు
సూర్యాపేట: చివ్వెంలలోని తెలంగాణ గిరిజన సంక్షేమ గురుకుల విద్యా సంస్థల సొసైటీ TGTWREIS ఆధ్వర్యంలో నడుస్తున్న మినీ గురుకుల పాఠశాలలో ఖాళీగా ఉన్న అకౌంటెంట్ పోస్టు భర్తీలో అవకతవకలు జరిగాయని బాధితురాలు ఆరోపించారు.
చివ్వెంల గ్రామానికి చెందిన బానోత్ యశోద సోమవారం జిల్లా కలెక్టర్‌కు ఫిర్యాదు చేశారు. తనకు గత మే 27న చివ్వెంల గిరిజన మినీ గురుకులంలో అకౌంటెంట్ పోస్టుకు నియామక ఉత్తర్వులు వచ్చాయని ఆమె తెలిపారు.
అయితే జిల్లా ఆర్సీవో జాను నాయక్ తనకు రావాల్సిన పోస్టును డబ్బులు తీసుకుని మరొకరికి అమ్మారని యశోద ఆరోపించారు. తగిన అర్హతలు ఉన్నప్పటికీ తనను పక్కనపెట్టి మరొకరికి ఉద్యోగం ఇప్పించారని చెప్పారు.
తన పేరిట వచ్చిన సర్క్యులర్‌ను మార్చి, నల్గొండ జిల్లాకు చెందిన సాయి ప్రత్యూష నాన్ లోకల్ అయినప్పటికీ చిరునామాను చివ్వెంలగా మార్చుకుని అక్రమంగా ఈ పోస్టు దక్కించుకున్నారని ఫిర్యాదులో పేర్కొన్నారు.
తనకు జరిగిన అన్యాయంపై పారదర్శకంగా విచారణ జరిపి బాధ్యులపై చర్యలు తీసుకోవాలని యశోద కలెక్టర్‌ను కోరారు. ఈ ఫిర్యాదుపై ఉన్నతాధికారులు విచారణ చేపట్టాల్సి ఉంది.




