Suryapet: నూతన్‌కల్‌లో డ్రగ్స్ రహిత సమాజంపై పోలీసుల అవగాహన
Suryapet: సూర్యాపేట ఎస్పీ ఆదేశాలతో నూతన్‌కల్‌లో గంజాయి, డ్రగ్స్ వినియోగంపై ఎస్ఐ నాగరాజు అవగాహన సదస్సు. మత్తు పదార్థాలకు దూరంగా ఉండాలని యువతకు సూచన.
Suryapet: నూతన్‌కల్‌లో డ్రగ్స్ రహిత సమాజంపై పోలీసుల అవగాహన
సూర్యాపేట: సమాజాన్ని డ్రగ్స్ రహితంగా తీర్చిదిద్దే లక్ష్యంతో సూర్యాపేట జిల్లా ఎస్పీ నరసింహ ఐపీఎస్ ఆదేశాల మేరకు నూతన్‌కల్ మండల కేంద్రంలో గురువారం పోలీస్ శాఖ ఆధ్వర్యంలో ప్రత్యేక అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు.
ఈ కార్యక్రమాన్ని నూతన్‌కల్ ఎస్ఐ నాగరాజు పర్యవేక్షించారు. ఆయన మాట్లాడుతూ మాదకద్రవ్యాల వినియోగం వల్ల యువత శారీరకంగా, మానసికంగా తీవ్రంగా నష్టపోతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. డ్రగ్స్ బారిన పడి విద్య, ఉద్యోగ అవకాశాలను పోగొట్టుకోవద్దని, వీటికి దూరంగా ఉంటేనే మంచి భవిష్యత్తు ఉంటుందని విద్యార్థులు, యువతకు సూచించారు.
డ్రగ్స్ రహిత సమాజ స్థాపన కోసం ప్రతి ఒక్కరూ బాధ్యతగా వ్యవహరించాలని ఎస్ఐ నాగరాజు పిలుపునిచ్చారు. గ్రామాల్లో అనుమానాస్పదంగా సంచరించే వ్యక్తులు, డ్రగ్స్ విక్రయాలు జరుగుతున్నట్లు సమాచారం తెలిస్తే వెంటనే పోలీసులకు సమాచారం అందించాలని కోరారు. సమాచారం ఇచ్చిన వారి వివరాలు గోప్యంగా ఉంచబడతాయని హామీ ఇచ్చారు.
ఈ కార్యక్రమంలో స్థానిక పోలీస్ సిబ్బంది, గ్రామ పెద్దలు, యువకులు మరియు పెద్ద సంఖ్యలో ప్రజలు పాల్గొని అవగాహన కార్యక్రమాన్ని విజయవంతం చేశారు.




