Suryapet: ఇందిరా గాంధీ జయంతి సందర్భంగా రోగులకు పండ్ల పంపిణీ!

Suryapet: భారత మాజీ ప్రధాని స్వర్గీయ ఇందిరా గాంధీ జయంతి సందర్భంగా సూర్యాపేట ఏరియా ఆసుపత్రిలో ఏఎంసీ చైర్మన్ కొప్పుల వేణారెడ్డి ఆధ్వర్యంలో రోగులకు పండ్లు పంపిణీ చేశారు.

PULUSU NAGARAJU, SURYAPETA
Published on: 20 Nov 2026 8:54 AM IST
Suryapet: ఇందిరా గాంధీ జయంతి సందర్భంగా రోగులకు పండ్ల పంపిణీ!
X

సూర్యాపేట: భారత మాజీ ప్రధానమంత్రి, ఉక్కు మహిళ స్వర్గీయ శ్రీమతి ఇందిరా గాంధీ జయంతి సందర్భంగా సూర్యాపేట పట్టణంలోని ఏరియా ఆసుపత్రిలో రోగులకు పండ్ల పంపిణీ కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు.

మార్కెట్ కమిటీ డైరెక్టర్ షేక్ అబ్దుల్ కరీం, జిల్లా కాంగ్రెస్ నాయకులు కోడి కిరణ్, పిల్లల నాగరాజు ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ కార్యక్రమంలో వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ కొప్పుల వేణారెడ్డి పాల్గొని ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న రోగులకు పండ్లు పంపిణీ చేశారు. రోగుల ఆరోగ్య పరిస్థితులను అడిగి తెలుసుకుని, వారు త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు.

ఈ సందర్భంగా కొప్పుల వేణారెడ్డి మాట్లాడుతూ భారతదేశ రాజకీయ చరిత్రలో ఇందిరా గాంధీకి ప్రత్యేకమైన స్థానం ఉందని, దేశ ఐక్యత, సమగ్రత, అభివృద్ధి కోసం ఆమె చేసిన సేవలు చిరస్మరణీయమని పేర్కొన్నారు. దేశం కోసం ఎన్నో సాహసోపేతమైన నిర్ణయాలు తీసుకుని, ఉక్కు మహిళగా ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు పొందిన గొప్ప నాయకురాలు ఇందిరా గాంధీ అని కొనియాడారు. పేదలు, బడుగు బలహీన వర్గాల సంక్షేమం కోసం ఆమె అమలు చేసిన కార్యక్రమాలు నేటికీ ప్రజల హృదయాల్లో నిలిచిపోయాయని అన్నారు.

మహానేతల జయంతి, వర్ధంతి కార్యక్రమాలను కేవలం నివాళులకే పరిమితం చేయకుండా, వారి ఆశయాలకు అనుగుణంగా సేవా కార్యక్రమాలు నిర్వహించడం నిజమైన నివాళి అని వేణారెడ్డి పేర్కొన్నారు. ప్రజలకు సేవ చేయడం, ఆపదలో ఉన్నవారికి అండగా నిలవడం కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తల బాధ్యత అని తెలిపారు.

ఇందిరా గాంధీ ఆశయాలను స్ఫూర్తిగా తీసుకుని ప్రజాసేవలో ముందుకు సాగుతామని నాయకులు పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు, మహిళా కాంగ్రెస్ నాయకురాలు, కార్యకర్తలు, ఆసుపత్రి సిబ్బంది పాల్గొన్నారు.

PULUSU NAGARAJU, SURYAPETA

PULUSU NAGARAJU, SURYAPETA