Suryapet: మేళ్లచెరువులో చార్జింగ్‌లో ఉన్న బ్యాటరీ బైక్ దగ్ధం!
Suryapet: సూర్యాపేట జిల్లా మేళ్లచెరువులో చార్జింగ్ పెడుతుండగా షార్ట్ సర్క్యూట్‌తో బ్యాటరీ బైక్ దగ్ధం. మై హోమ్ ఫైర్ ఇంజన్ సిబ్బందితో అదుపులోకి వచ్చిన మంటలు.
Suryapet: మేళ్లచెరువులో చార్జింగ్‌లో ఉన్న బ్యాటరీ బైక్ దగ్ధం!
Suryapet: మేళ్లచెరువులో చార్జింగ్ పెడుతున్న సమయంలో షార్ట్ సర్క్యూట్ కారణంగా బ్యాటరీ బైక్ దగ్ధమైన ఘటన చోటుచేసుకుంది. మేళ్లచెరువు మెయిన్ రోడ్డులో ఉన్న ఎస్వీ రెడీమేడ్ డ్రెస్సెస్ యజమాని సామల వెంకట్ రెడ్డి ఎప్పటిలాగే సోమవారం ఉదయం తన బ్యాటరీ బైక్‌కు చార్జింగ్ పెట్టారు. కొద్దిసేపటికే షార్ట్ సర్క్యూట్ కారణంగా బైక్‌కు మంటలు అంటుకున్నాయి. క్షణాల్లోనే మంటలు వ్యాపించి బైక్ పూర్తిగా దగ్ధమైంది.
సమాచారం అందుకున్న మై హోమ్ సిమెంట్ పరిశ్రమకు చెందిన ఫైర్ ఇంజన్ సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకుని మంటలను అదుపులోకి తీసుకువచ్చారు. అనంతరం పూర్తిగా చల్లార్చారు. ఈ ఘటనలో బైక్ పూర్తిగా దగ్ధమైనప్పటికీ, ఎలాంటి ఇతర ఆస్తి నష్టం సంభవించలేదు.




