Suryapet: బుల్లెట్ ట్రైన్ వంటావార్పులో ప్రజలు పాల్గొనాలి

Suryapet: ఈనెల 21న సూర్యాపేట మీదుగా ఎన్‌హెచ్-65పై బుల్లెట్ ట్రైన్ సాధన కోసం చేపట్టే వంటావార్పు నిరసనలో ప్రజలు, సంఘాలు పెద్దఎత్తున పాల్గొనాలని నేతలు కోరారు.

PULUSU NAGARAJU, SURYAPETA
Published on: 19 Nov 2026 8:41 PM IST
Suryapet
X

Suryapet: బుల్లెట్ ట్రైన్ వంటావార్పులో ప్రజలు పాల్గొనాలి

సూర్యాపేట: ఈనెల 21న బుల్లి ట్రైన్ సాధన లక్ష్యంగా కొనసాగుతున్న ఉద్యమ కార్యాచరణ లో భాగంగా నిర్వహించే వంటావార్పు కార్యక్రమంలో ప్రజలంతా భాగస్వాములు కావాలని ఉద్యమ కమిటీ సభ్యులు కోరారు. గురువారం స్థానిక హోటల్ శ్రీ గ్రాండ్ లో జరిగిన అఖిలపక్ష ఉద్యమ సన్నాహక కార్యక్రమo లో వారు మాట్లాడారు.

పట్టణంలోని వర్తక వాణిజ్య వ్యాపార కుల రాజకీయ ఉద్యోగ విద్య యువజన మహిళ కార్మిక సంఘాలు సెంటర్ల వారీగా ఎంపిక చేసుకున్నారని ఉదయం 8 గంటల నుండే వంటా వార్పు కార్యక్రమం ప్రారంభించాలని తెలిపారు. విశాలంగా ఉన్న రోడ్ల మధ్యలో ను ఇరుకుగా ఉన్న రోడ్లకు రోడ్డు పక్కన వంటలు ఏర్పాటు చేయాలని భోజనాలు మాత్రం రోడ్డుకిరువైపులా బారులుగా నిలబడి లేదా కూర్చొని చేయాలన్నారు.

మనం చేసే ఈ వంటావార్పు నిరసన కార్యక్రమం తెలంగాణ రాష్ట్రం తో పాటు కేంద్ర ప్రభుత్వం వరకు చేరుకోవాలని బుల్లెట్ ట్రైన్ ముందుగా ప్రకటించిన ప్రకారం జాతీయ రహదారి 65 సూర్యాపేట మీదుగా కొనసాగించాలని డిమాండ్ ను గట్టిగా తెలియజేయాలని తెలిపారు. సాదాసీదాగా కొనసాగిన ఈ బుల్లెట్ ట్రైన్ ఉద్యమం బుల్లెట్ ట్రైన్ పక్కదో పట్టించే కుట్రలను భగ్నం చేసి ఢిల్లీ పెద్దలను పడేసిన స్థాయికి చేరిందన్నారు.

అదేవిధంగా జిల్లాలోని అన్ని మండల కేంద్రాల్లోనూ ప్రధాన రహదారులు ఈ వంటావార్పు కార్యక్రమాన్ని ప్రతి ఒక్కరు కొనసాగించాలన్నారు. కనీసం 100 మందికి పులిహోర వంట చేసి రోడ్లపై బుల్లెట్ ట్రైన్ సాధన నిరసన ను తెలపాలని కోరారు. ఈ సందర్భంగా సెంటర్ల వారీగా ఉద్యమ సభ్యులు పర్యవేక్షణ కమిటీలను ఎంపిక చేశారు.

ఈ కార్యక్రమంలో కమిటీ కో కన్వీనర్లు, పెద్దిరెడ్డి రాజా , సలహాదారు రమణాచారి,ధర్మార్జున్ నిమ్మల శ్రీనివాస్ గౌడ్, చల్లమల్ల నరసింహ, బండారి డేవిడ్ కుమార్, కొత్తపల్లి శివకుమార్, వెలుగు వనిత, అనంతుల మధు,భూపతి రాములు,మట్టి పెళ్లి సైదులు, గంట నాగయ్య, సకినాల కృష్ణ, జీడి బిక్షం, పందిరి మాధవరెడ్డి, జలగం మల్లేష్, నేరెళ్ల మధు, ఎరకచర్ల శోభారాణి, విజయమ్మ, సట్టు నాగయ్య, పోలేబోయిన కిరణ్ తదితరులు పాల్గొన్నారు.

PULUSU NAGARAJU, SURYAPETA

PULUSU NAGARAJU, SURYAPETA