సూర్యాపేట: ఇందిరా మహిళా శక్తి భవనం పనులు వేగవంతం చేయాలి: కలెక్టర్

సూర్యాపేట: సూర్యాపేటలో ఇందిరా మహిళా శక్తి భవన నిర్మాణ పనులను పరిశీలించిన కలెక్టర్ తేజస్ నంద్ లాల్ పవార్, వాటిని త్వరితగతిన పూర్తి చేయాలని ఆదేశించారు.

PULUSU NAGARAJU, SURYAPETA
Published on: 9 Aug 2026 8:41 AM IST
సూర్యాపేట
X

సూర్యాపేట: ఇందిరా మహిళా శక్తి భవనం పనులు వేగవంతం చేయాలి: కలెక్టర్

ఇందిరా మహిళా శక్తి భవనం పనులు వేగవంతం చేయాలి: కలెక్టర్ తేజస్ నంద్ లాల్ పవార్

సూర్యాపేట: జిల్లా కేంద్రంలో నిర్మాణంలో ఉన్న ఇందిరా మహిళా శక్తి భవనం పనులను యుద్ధ ప్రాతిపదికన పూర్తి చేయాలని జిల్లా కలెక్టర్ తేజస్ నంద్ లాల్ పవార్ అధికారులను ఆదేశించారు.

శనివారం కలెక్టర్ భవన నిర్మాణ పనులను స్వయంగా పరిశీలించారు. పనుల పురోగతి వివరాలను అడిగి తెలుసుకున్న ఆయన, పెండింగ్‌లో ఉన్న పనులను త్వరగా పూర్తి చేయాలని సూచించారు.

ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ, మహిళల సాధికారత కోసం ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్న ఈ భవనం అందుబాటులోకి వస్తే జిల్లాలోని మహిళా సంఘాలకు ఎంతో మేలు జరుగుతుందని అన్నారు. భవనానికి సంబంధించి మిగిలి ఉన్న బ్యాలెన్స్ పనులను వెంటనే పూర్తి చేసి ప్రారంభోత్సవానికి సిద్ధం చేయాలని ఆదేశించారు.

ముఖ్యంగా విద్యుత్ సరఫరా, తాగునీటి వసతి, పెయింటింగ్ మరియు ఫినిషింగ్ పనుల్లో ఎలాంటి జాప్యం ఉండకూడదని స్పష్టం చేశారు. నాణ్యతా ప్రమాణాలను పాటిస్తూ, నిర్ణీత గడువులోగా పనులు పూర్తి చేయాలని కాంట్రాక్టర్లకు, సంబంధిత శాఖల అధికారులకు ఆదేశాలు జారీ చేశారు.

ఈ భవనం ప్రారంభమైన తర్వాత జిల్లాలోని మహిళా సంఘాల కార్యకలాపాలకు, శిక్షణ కార్యక్రమాలకు ప్రధాన వేదికగా ఉపయోగపడుతుందని కలెక్టర్ తెలిపారు.

ఈ తనిఖీలో డిఆర్డిఓ సన్యాసయ్యతో పాటు సంబంధిత శాఖల అధికారులు పాల్గొన్నారు.

PULUSU NAGARAJU, SURYAPETA

PULUSU NAGARAJU, SURYAPETA

Next Story