Suryapet: సూర్యాపేట జిల్లాలో సోమవారం నుంచి మండల స్థాయిలో ప్రజావాణి

Suryapet: సూర్యాపేట జిల్లాలో ఆగస్టు 17 నుంచి ప్రతి సోమవారం మండల స్థాయిలో ప్రజావాణి నిర్వహణ. ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని కలెక్టర్ తేజస్ నంద్ లాల్ పవార్ పిలుపు.

PULUSU NAGARAJU, SURYAPETA
Published on: 16 Aug 2026 8:25 PM IST
Suryapet
X

Suryapet: సూర్యాపేట జిల్లాలో సోమవారం నుంచి మండల స్థాయిలో ప్రజావాణి

సూర్యాపేట: మండల స్థాయిలో ప్రజా సమస్యలను త్వరితగతిన పరిష్కరించేందుకు ప్రభుత్వం ప్రజావాణి కార్యక్రమాన్ని ప్రారంభించిందని జిల్లా కలెక్టర్ తేజస్ నంద్ లాల్ పవార్ తెలిపారు.

ఆదివారం ఆయన విడుదల చేసిన పత్రికా ప్రకటనలో ఈ మేరకు వివరాలు వెల్లడించారు. ఈ నెల 17వ తేదీ నుంచి ప్రతి సోమవారం స్థానిక ఎంపీడీఓ కార్యాలయంలో ప్రజావాణి కార్యక్రమం నిర్వహించనున్నట్లు పేర్కొన్నారు.

ఈ కార్యక్రమానికి మండల స్థాయి రెవెన్యూ, పంచాయతీరాజ్, విద్యుత్, వైద్య, విద్య, వ్యవసాయ, ఉద్యాన, పశుసంవర్ధక, మత్స్య, ఫారెస్ట్, అంగన్వాడీ తదితర శాఖల అధికారులు విధిగా హాజరు కానున్నారని కలెక్టర్ తెలిపారు.

ఆయా మండలాలకు చెందిన గ్రామ ప్రజలు ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు స్థానిక మండల పరిషత్ కార్యాలయానికి వచ్చి తమ సమస్యలకు సంబంధించిన అర్జీలను అందజేయాలని సూచించారు. ప్రజలు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని ఆయన కోరారు.

PULUSU NAGARAJU, SURYAPETA

PULUSU NAGARAJU, SURYAPETA

Next Story