Suryapet: వైఎస్ఆర్ జయంతి వేడుకలు.. నివాళులర్పించిన కాంగ్రెస్ నేతలు!
Suryapet: సూర్యాపేట నియోజకవర్గంలో దివంగత ముఖ్యమంత్రి డాక్టర్ వై.ఎస్. రాజశేఖర్ రెడ్డి జయంతి వేడుకలను కాంగ్రెస్ పార్టీ శ్రేణులు ఘనంగా నిర్వహించాయి
Suryapet: వైఎస్ఆర్ జయంతి వేడుకలు.. నివాళులర్పించిన కాంగ్రెస్ నేతలు!
సూర్యాపేట: దివంగత మాజీ ముఖ్యమంత్రి డాక్టర్ వై.ఎస్. రాజశేఖర్ రెడ్డి జయంతి సందర్భంగా సూర్యాపేట నియోజకవర్గంలో ఘనంగా నివాళులు అర్పించారు.
వాణిజ్య భవన్ చౌరస్తాలో పట్టణ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వెలుగు వెంకన్న, మున్సిపల్ ఫ్లోర్ లీడర్ కుమ్మరికుంట్ల వేణుగోపాల్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన కార్యక్రమానికి ఏఐసీసీ సభ్యులు రాంరెడ్డి సర్వోత్తమ్ రెడ్డి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. రాష్ట్ర కాంగ్రెస్ సీనియర్ నాయకులు పోతు భాస్కర్, డీసీ అధ్యక్షుడు గుడిపాటి నర్సయ్య, పీసీసీ ప్రధాన కార్యదర్శి చకిలం రాజేశ్వర్ రావు, మున్సిపల్ చైర్ పర్సన్ మొరిశెట్టి నివేదిత లక్షాది, మున్సిపల్ వైస్ చైర్మన్ యండి షఫీ ఉల్లా తదితరులు పాల్గొని వైఎస్ఆర్ చిత్రపటానికి పూలమాల వేసి నివాళులు అర్పించారు.
ఈ సందర్భంగా రాంరెడ్డి సర్వోత్తమ్ రెడ్డి మాట్లాడుతూ, డాక్టర్ వై.ఎస్. రాజశేఖర్ రెడ్డి ప్రజల హృదయాల్లో చిరస్థాయిగా నిలిచిపోయిన నాయకుడని కొనియాడారు. రైతు, పేద, బడుగు, బలహీన వర్గాల సంక్షేమమే లక్ష్యంగా ఆయన పని చేశారని గుర్తు చేశారు.
వ్యవసాయానికి ఉచిత విద్యుత్, రైతు రుణ సౌకర్యాలు, ఆరోగ్యశ్రీ, ఫీజు రీయింబర్స్‌మెంట్, ఇందిరమ్మ గృహాలు, 108 అంబులెన్స్ సేవలు, 104 ఆరోగ్య సేవలు, జలయజ్ఞం వంటి చారిత్రాత్మక పథకాల ద్వారా కోట్లాది మంది జీవితాల్లో వెలుగులు నింపారని తెలిపారు. ఆయన నాయకత్వంలో అప్పటి కాంగ్రెస్ ప్రభుత్వం అభివృద్ధి, సంక్షేమాన్ని సమపాళ్లలో అమలు చేసి రాష్ట్రానికి విశేష సేవలు అందించిందని పేర్కొన్నారు.




