Suryapet: ధాన్యం కొనుగోలులో జాప్యం వద్దు.. ఫార్మర్ రిజిస్ట్రీని పూర్తి చేయండి: అధికారులకు సీఎస్ రామకృష్ణారావు ఆదేశం
Suryapet: రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రామకృష్ణారావు అన్ని జిల్లాల కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు.
Suryapet: ధాన్యం కొనుగోలులో జాప్యం వద్దు.. ఫార్మర్ రిజిస్ట్రీని పూర్తి చేయండి: అధికారులకు సీఎస్ రామకృష్ణారావు ఆదేశం
సూర్యాపేట: ధాన్యం కొనుగోలు ప్రక్రియను వేగవంతం చేసి రైతులకు ఇబ్బందులు లేకుండా చూడాలని రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రామకృష్ణారావు అధికారులను ఆదేశించారు. హైదరాబాద్ నుంచి అన్ని జిల్లాల కలెక్టర్లు, పౌర సరఫరాలు, విద్యా, డీఆర్డీఓ అధికారులతో ఆయన వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ధాన్యం కొనుగోలుతో పాటు ఫార్మర్ రిజిస్ట్రీ, సెన్సస్, విద్యా వారోత్సవాలపై సమీక్షించారు.
ఫార్మర్ రిజిస్ట్రీ వంద శాతం పూర్తి చేయాలని, సెల్ఫ్ ఎన్యూమరేషన్‌ను వేగవంతం చేయాలని సీఎస్ సూచించారు. రాష్ట్రంలోని 10 లక్షలకు పైగా ప్రభుత్వ ఉద్యోగులు స్వీయ గణన చేసుకోవాలన్నారు. ఈ నెల 11 నుంచి జరిగే విద్యా వారోత్సవాలను విజయవంతం చేయాలని ఆదేశించారు.
జిల్లా కలెక్టర్ తేజస్ నంద్ లాల్ పవార్ మాట్లాడుతూ ఫార్మర్ రిజిస్ట్రీ, ధాన్యం కొనుగోళ్లు, విద్యా వారోత్సవాలను షెడ్యూల్ ప్రకారం నిర్వహిస్తామని తెలిపారు. సెన్సస్ సిబ్బందికి శిక్షణ ఇచ్చి సిద్ధం చేస్తున్నామన్నారు. సమావేశంలో అదనపు కలెక్టర్ బి. హరి సింగ్, జిల్లా పరిషత్ సీఈఓ శిరీష, పలు శాఖల అధికారులు పాల్గొన్నారు.




