Suryapet: ఆగస్టు 31 వరకు 30 పోలీస్ యాక్ట్ అమలు: ఎస్పీ నరసింహ ఐపీఎస్!

Suryapet: సూర్యాపేట జిల్లాలో శాంతిభద్రతల పరిరక్షణ కోసం ఆగస్టు 1 నుండి 31 వరకు 30 పోలీస్ యాక్ట్ విధిస్తున్నట్లు జిల్లా ఎస్పీ కె. నరసింహ ఐపీఎస్ తెలిపారు.

PULUSU NAGARAJU, SURYAPETA
Published on: 1 Aug 2026 11:36 PM IST
Suryapet
X

Suryapet: ఆగస్టు 31 వరకు 30 పోలీస్ యాక్ట్ అమలు: ఎస్పీ నరసింహ ఐపీఎస్!

సూర్యాపేట: శాంతి భద్రతల పరిరక్షణలో భాగంగా సూర్యాపేట జిల్లా వ్యాప్తంగా ఆగస్ట్ 1వ తేదీ నుంచి 31వ తేదీ వరకు 30 పోలీస్ యాక్ట్ అమల్లో ఉంటుందని జిల్లా ఎస్పీ నరసింహ, ఐపిఎస్ శనివారం ఒక ప్రకటనలో తెలిపారు.

జిల్లాలో అసాంఘిక కార్యక్రమాలు, అవాంఛనీయ సంఘటనలు జరగకుండా, ప్రస్తుత ప్రశాంత వాతావరణం కొనసాగేందుకు ఈ చర్యలు తీసుకున్నామని ఎస్పీ వివరించారు.

30 పోలీస్ యాక్ట్ అమల్లో ఉన్న నేపథ్యంలో డిఎస్పి లేదా అంతకు పై స్థాయి అధికారుల నుంచి ముందస్తు అనుమతి లేకుండా ఎలాంటి ప్రజా సమావేశాలు, ఊరేగింపులు, ధర్నాలు, బహిరంగ సభలు నిర్వహించరాదని స్పష్టం చేశారు. ప్రజలు గుమిగూడే విధంగా ఎలాంటి కార్యక్రమాలు, సన్నాహాలు చేయరాదని ఆదేశించారు.

అలాగే నిషేధిత ఆయుధాలు, కత్తులు, కర్రలు, దుడ్డు కర్రలు, తుపాకులు, పేలుడు పదార్థాలు కలిగి ఉండటంపై నిషేధం విధించారు. ప్రజా జీవనానికి ఆటంకం కలిగించే జనసమూహాలను పూర్తిగా నిషేధిస్తున్నట్లు పేర్కొన్నారు.

అధిక శబ్దం వచ్చే స్పీకర్లు, డీజేలు, ప్రచార రథాలు, మైకులు వంటి పరికరాల వినియోగానికి కూడా అనుమతి లేదని ఎస్పీ సూచించారు.

ఉత్తర్వులను ఉల్లంఘించిన వారిపై 30 పోలీస్ యాక్ట్ ప్రకారం చట్టపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ఎలాంటి కార్యక్రమాలు నిర్వహించాలన్నా ముందస్తుగా దరఖాస్తు చేసుకొని అనుమతి పొందాలని ప్రజలకు విజ్ఞప్తి చేశారు.

PULUSU NAGARAJU, SURYAPETA

PULUSU NAGARAJU, SURYAPETA

Next Story