Suryapet: సూర్యాపేటలో యువజన కాంగ్రెస్ విస్తృత స్థాయి సమావేశం!

Suryapet: సూర్యాపేట జిల్లా కాంగ్రెస్ కార్యాలయంలో యువజన కాంగ్రెస్ విస్తృత స్థాయి సమావేశం జరిగింది. కేంద్ర ప్రభుత్వ ప్రజావ్యతిరేక విధానాలపై పోరాడాలని పిలుపునిచ్చారు.

PULUSU NAGARAJU, SURYAPETA
Published on: 26 Jun 2026 5:36 PM IST
Suryapet
X

Suryapet: సూర్యాపేటలో యువజన కాంగ్రెస్ విస్తృత స్థాయి సమావేశం!

సూర్యాపేట: సూర్యాపేట నియోజకవర్గ కేంద్రంలోని జిల్లా కాంగ్రెస్ పార్టీ కార్యాలయం రెడ్ హౌస్‌లో జిల్లా యువజన కాంగ్రెస్ కార్యవర్గ విస్తృత స్థాయి సమావేశం జరిగింది. జిల్లా అధ్యక్షుడు ఎలిమినేటి అభినయ్ నాయుడు అధ్యక్షతన జరిగిన ఈ సమావేశానికి ఏఐసీసీ సభ్యులు రాంరెడ్డి సర్వోత్తమ్ రెడ్డి, మున్సిపల్ చైర్ పర్సన్ మొరిశెట్టి నివేదిత లక్షాది ముఖ్య అతిథులుగా హాజరయ్యారు.

సమావేశంలో జిల్లా వ్యాప్తంగా యువజన కాంగ్రెస్ చేపట్టిన కార్యక్రమాలను సమీక్షించారు. రాబోయే రోజుల్లో చేపట్టాల్సిన కార్యాచరణపై నేతలు దిశానిర్దేశం చేశారు.

ఈ సందర్భంగా సర్వోత్తమ్ రెడ్డి మాట్లాడుతూ, కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వ ప్రజావ్యతిరేక విధానాలను ప్రజలకు వివరించాలని యువజన కాంగ్రెస్ శ్రేణులకు పిలుపునిచ్చారు. లోక్‌సభ ప్రతిపక్ష నాయకులు రాహుల్ గాంధీ సూచనల మేరకు కేంద్ర ప్రభుత్వంపై ప్రజా సమస్యలపై నిరసన కార్యక్రమాలు చేపట్టాలని సూచించారు.

ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, జిల్లా మంత్రి ఉత్తమన్న నాయకత్వంలో రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలను ప్రజల్లోకి విస్తృతంగా తీసుకెళ్లాలని నాయకులకు దిశానిర్దేశం చేశారు.

పట్టణ యువజన కాంగ్రెస్ కమిటీ పూర్తి స్థాయి నియామకం కోసం గ్రామీణ, వార్డు స్థాయిలో ఉత్సాహవంతుల నుండి దరఖాస్తులు స్వీకరిస్తున్నట్లు తెలిపారు. కాంగ్రెస్ పార్టీకి ప్రతిబింబం యువజన కాంగ్రెస్ అని, SIR కార్యక్రమంలో బూత్ ఏజెంట్లతో సమన్వయం చేసుకుంటూ పనిచేయాలని సూచించారు.

ఇతర నియోజకవర్గాల్లో లేని విధంగా సూర్యాపేట నియోజకవర్గంలో బూత్ ఏజెంట్లకు ఐడీ కార్డులు అందజేస్తున్నామని, ఒక్క ఓటు కూడా తొలగించకుండా ఓటర్లకు అవగాహన కల్పిస్తూ కార్యకర్తలు పటిష్టంగా పనిచేయాలని అన్నారు. న్యాయవాదుల రక్షణ కోసం చట్టం తీసుకొచ్చిన ఘనత కాంగ్రెస్ పార్టీదేనని, ఈ విషయాన్ని యువజన కాంగ్రెస్ కార్యకర్తలు ప్రజల్లోకి తీసుకెళ్లాలని కోరారు.

PULUSU NAGARAJU, SURYAPETA

PULUSU NAGARAJU, SURYAPETA

Next Story