Suryapet: సూర్యాపేటలో నీటి కరువు.. అధికారులపై జనం ఆగ్రహం
Suryapet: సూర్యాపేట జిల్లా కేంద్రంలోని భాగ్యనగర్ కాలనీలో నెలరోజులుగా మంచినీటి సరఫరా నిలిచిపోవడంతో మహిళలు ఖాళీ బిందెలతో రోడ్డెక్కారు.
Suryapet: సూర్యాపేటలో నీటి కరువు.. అధికారులపై జనం ఆగ్రహం
Suryapet: నెల రోజులుగా తమ ఇండ్లకు మంచినీళ్లు రావడంలేదని ప్రజాప్రతినిధులకు, అధికారులకు విషయాన్ని విన్నవించిన ఎలాంటి ఫలితం లేదని సూర్యాపేట జిల్లా కేంద్రంలోని కూడ కూడ భాగ్యనగర్ కాలనీకి చెందిన మహిళలు బుధవారం సూర్యాపేట దంతాలపల్లి రహదారిపై ఖాళీ బిందెలతో పెద్ద ఎత్తున ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా పలువురు మహిళలు మాట్లాడుతూ నెల రోజులుగా తమ ఇండ్లకు మంచినీళ్లు రావడంలేదని దీంతో తాగడానికి, కనీస అవసరాలు తీర్చుకునేందుకు ఇబ్బందికరంగా ఉందన్నారు. ఈ విషయాన్ని అధికారులకు ప్రజాప్రతినిధులకు విన్నవించినప్పటికీ ఎలాంటి ఫలితం లేదన్నారు. మేము అన్నం లేకుండా ఉంటాము కానీ మంచి నీళ్లు లేకుండా ఎలా ఉండాలని అధికారులను ప్రశ్నించారు. తమ ప్రాంతంలో బడుగు బలహీన వర్గాల ప్రజలు అధికంగా ఉన్నారని అందుకే ప్రజాప్రతినిధూలు అధికారులు పట్టించుకోవడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. తమ ఓట్లతో గెలిచిన ప్రజాప్రతినిధులు మేము డబ్బులు ఇస్తే మీరు ఓటు వేశారని నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని అన్నారు.
తమ ప్రాంతంలో తమ ఇంట్లో ముందు కాలువలు తీయమంటే కూడా డబ్బులు అడుగుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. నెల రోజులుగా అధికారులు ప్రజాప్రతినిధులు వారి ఇండ్లలో నీళ్లు రాకుంటే ఎలా ఉంటారా అని ప్రశ్నించారు. సామాన్య ప్రజల సమస్యలు అంటే అధికారులకు ప్రజాప్రతినిధులకు పట్టింపులేదని ఉన్నత అధికారులు స్పందించి తమ ప్రాంతంలో మంచినీటి సమస్యను వెంటనే పరిష్కరించాలని డిమాండ్ చేశారు. లేనిపక్షంలో మండు వేసవిలో మంచినీటి ఎద్దడితో మా గొంతేండి చస్తామన్నారు. విషయం తెలుసుకున్న పోలీసులు ధర్నా వద్దకు చేరుకొని ధర్నా చేస్తున్న మహిళలను చెదరగొట్టారు.




