Suryapet: వినియోగదారుల మన్ననలతో రాణించాలి: సర్వోత్తమ్ రెడ్డి!

Suryapet: సూర్యాపేట శంకర్ విలాస్ సెంటర్‌లో నూతన డ్రై ఫ్రూట్స్ హౌస్‌ను పట్టభద్రుల ఎమ్మెల్సీ కాంగ్రెస్ అభ్యర్థి సర్వోత్తమ్ రెడ్డి, చైర్‌పర్సన్ నివేదిత ప్రారంభించారు.

PULUSU NAGARAJU, SURYAPETA
Published on: 29 Oct 2026 8:07 PM IST
Suryapet
X

Suryapet: వినియోగదారుల మన్ననలతో రాణించాలి: సర్వోత్తమ్ రెడ్డి!

సూర్యాపేట: వినియోగదారుల మన్ననలు పొందుతూ వ్యాపార రంగంలో ముందుకు సాగాలని నల్లగొండ-ఖమ్మం-వరంగల్ పట్టభద్రుల ఎమ్మెల్సీ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి రాంరెడ్డి సర్వోత్తమ్ రెడ్డి, మున్సిపల్ చైర్‌పర్సన్ మొరిశెట్టి నివేదిత లక్షాధి అన్నారు.

గురువారం సూర్యాపేట జిల్లా కేంద్రంలోని శంకర్ విలాస్ సెంటర్‌లో నూతనంగా ఏర్పాటు చేసిన డ్రై ఫ్రూట్స్ హౌస్‌ను వారు ప్రారంభించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ సూర్యాపేటలో నూతనంగా వ్యాపార సంస్థను ప్రారంభించడం అభినందనీయమన్నారు. వ్యాపారులు నాణ్యమైన ఉత్పత్తులను అందిస్తూ వినియోగదారుల మన్ననలను పొందాలని ఆకాంక్షించారు.

ఈ కార్యక్రమంలో రాష్ట్ర కాంగ్రెస్ నాయకులు పోతు భాస్కర్, మున్సిపల్ ఫ్లోర్ లీడర్ కుమ్మరికుంట్ల వేణుగోపాల్, దండు మైసమ్మ దేవాలయ చైర్మన్ తంగేళ్ల కర్ణాకర్ రెడ్డి, కౌన్సిలర్లు కొండపల్లి దిలీప్ రెడ్డి, నాగుల వాసు, డ్రై ఫ్రూట్స్ హౌస్ సిబ్బంది రమేష్, తిరుపతమ్మ, శివ, కవిత, రాజేష్, శివారెడ్డి, స్వాతి, తరుణి, నిర్వాహకులు పాషా, రవి తదితరులు పాల్గొన్నారు.

PULUSU NAGARAJU, SURYAPETA

PULUSU NAGARAJU, SURYAPETA