Suryapet: బంగారం దుకాణాల్లో సీసీ కెమెరాలు, అలారాలు తప్పనిసరి

Suryapet: సూర్యాపేట పట్టణంలోని బంగారం దుకాణాలకు పటిష్ట భద్రత కల్పించాలని డీఎస్పీ ప్రసన్నకుమార్ సూచించారు.

PULUSU NAGARAJU, SURYAPETA
Published on: 4 May 2026 9:38 PM IST
Suryapet
X

Suryapet: బంగారం దుకాణాల్లో సీసీ కెమెరాలు, అలారాలు తప్పనిసరి

Suryapet: సూర్యాపేట పట్టణ పోలీసులు సోమవారం గోల్డ్ షాప్ అసోసియేషన్ సభ్యులతో సమావేశం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి సూర్యాపేట డివిజన్ డీఎస్పీ ప్రసన్నకుమార్, పట్టణ ఇన్స్పెక్టర్ వెంకటయ్య హాజరై యజమానులకు భద్రతా అంశాలపై అవగాహన కల్పించారు.

ఈ సందర్భంగా డీఎస్పీ ప్రసన్నకుమార్ మాట్లాడుతూ "మన భద్రత మన చేతుల్లోనే ఉంది. వ్యాపార నిర్వహణకు పటిష్ట రక్షణ ఏర్పాటు చేసుకోవాలి" అని సూచించారు. ఆర్థికపరమైన వ్యాపార సముదాయాల వద్ద భద్రత కల్పించాలని, రక్షణ చర్యలు తీసుకునేలా యజమానులను మోటివేట్ చేయాలని జిల్లా ఎస్పీ నర్సింహా ఐపీఎస్ ఆదేశించినట్లు తెలిపారు.

కరీంనగర్‌లో పట్టపగలు జరిగిన బంగారం దుకాణం దోపిడీ ఘటనను ప్రస్తావిస్తూ అప్రమత్తంగా ఉండాలన్నారు. దుకాణాల్లో అత్యాధునిక సీసీటీవీ కెమెరాలు, అలారం సిస్టం ఏర్పాటు చేసుకోవాలని, విలువైన ఆభరణాలను సేఫ్ లాకర్లలోనే ఉంచాలని సూచించారు. లాకర్ లేని పక్షంలో రాత్రిపూట దుకాణంలో వస్తువులు ఉంచవద్దని అన్నారు.

బంగారం విలువ పెరిగే కొద్దీ దోపిడీలు పెరుగుతున్నాయని, వ్యక్తిగత రక్షణ చర్యలు చాలా ముఖ్యమని చెప్పారు. వాచ్‌మెన్‌ను ఏర్పాటు చేసుకోవాలని, బంగారం ప్రదర్శనలో జాగ్రత్తలు తీసుకోవాలని, బిల్డింగ్ నిర్మాణంలో పూర్తి స్థాయిలో కాంక్రీట్ వాడాలని సూచించారు.

రాత్రి సమయంలో 24 గంటల పోలీసు బీట్ సిస్టం పెంచినట్లు తెలిపారు. అనుకోని సంఘటనలు జరిగి బాధపడే కంటే ముందస్తుగానే పటిష్ట రక్షణ చర్యలు తీసుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో గోల్డ్ షాప్ సంఘం సభ్యులు విజయ్, రాములు, ఇతర వ్యాపారులు పాల్గొన్నారు.

PULUSU NAGARAJU, SURYAPETA

PULUSU NAGARAJU, SURYAPETA

Next Story