Suryapet: అర్హులైన ప్రతి పేదవాడికి ఇందిరమ్మ ఇల్లు - పంతంగి దశరథ
Suryapet: సూర్యాపేట 14వ వార్డులో ఇందిరమ్మ ఇంటి నిర్మాణానికి శంకుస్థాపన చేసిన కాంగ్రెస్ ఇంచార్జ్ పంతంగి దశరథ, అర్హులందరికీ ఇళ్లు ఇస్తామని తెలిపారు.
Suryapet: అర్హులైన ప్రతి పేదవాడికి ఇందిరమ్మ ఇల్లు - పంతంగి దశరథ
సూర్యాపేట: వార్డులో అర్హులైన ప్రతి పేదవాడికి ఇందిరమ్మ ఇల్లు మంజూరు చేయిస్తానని 14వ వార్డు కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్ పంతంగి దశరథ అన్నారు. ఆదివారం జిల్లా కేంద్రంలోని 14వ వార్డులో యాతాకుల అంజలి - జనార్ధన్ ఇందిరమ్మ ఇంటికి శంకుస్థాపన చేసి ఆయన మాట్లాడారు.
ఏఐసీసీ సభ్యులు రామ్ రెడ్డి సర్వోత్తమ్ రెడ్డి, తెలంగాణ టూరిజం అభివృద్ధి కమిటీ మాజీ చైర్మన్ పటేల్ రమేష్ రెడ్డి, రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ నాయకులు పోతు భాస్కర్, మున్సిపల్ చైర్ పర్సన్ మొరిశెట్టి నివేదిత లక్షాదిల ఆదేశానుసారం వార్డులో ఇప్పటివరకు 10 ఇందిరమ్మ ఇండ్లు మంజూరయ్యాయన్నారు. ఇంకా అవసరమైన వారికి కాంగ్రెస్ ప్రభుత్వం తప్పక మంజూరు చేస్తుందని తెలిపారు.
గుడిసె లేని రాష్ట్రంగా ఉండాలని సీఎం రేవంత్ రెడ్డి ప్రభుత్వం పని చేస్తుందన్నారు. రానున్న ఎమ్మెల్సీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ వైపు ప్రజలు ఉండి ఎమ్మెల్సీ అభ్యర్థిగా పోటీ చేస్తున్న రాంరెడ్డి సర్వోత్తమ్ రెడ్డికి తమ మద్దతు పలకాలని కోరారు. ఈ కార్యక్రమంలో నాయకులు మైసయ్య, సాయి, సైదులు, రాములు, జ్యోతి, నహీమూన్ తదితరులు పాల్గొన్నారు.




