Suryapet: తడిసిన ధాన్యం.. ఆరని రైతుల కన్నీరు!

Suryapet: సూర్యాపేటలో ధాన్యం కొనుగోళ్ల జాప్యంపై రైతుల భారీ ఆందోళన. సూర్యాపేట - జనగామ రహదారిపై బైఠాయింపు.

PULUSU NAGARAJU, SURYAPETA
Published on: 6 May 2026 2:42 PM IST
Suryapet
X

Suryapet: తడిసిన ధాన్యం.. ఆరని రైతుల కన్నీరు!

Suryapet: ఐకేపీ కేంద్రాల్లో గత నెల రోజులుగా ధాన్యం కొనుగోలు ప్రక్రియ నిలిచిపోవడంతో సూర్యాపేట జిల్లా రైతులు తీవ్ర ఆందోళనకు దిగారు. సోమవారం బాలెంల వద్ద సూర్యాపేట-జనగామ ప్రధాన రహదారిపై పెద్ద సంఖ్యలో రైతులు బైఠాయించి నిరసన తెలిపారు. దీంతో ఆ మార్గంలో భారీగా ట్రాఫిక్ స్తంభించిపోయి వాహనదారులు గంటల తరబడి తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు.

కొనుగోళ్లు లేకపోవడం, అధికారులు కాంటాలు వేయకపోవడంతో అకాల వర్షాలకు కళ్లాల్లో ఆరబోసిన ధాన్యం పూర్తిగా తడిసి తీవ్రంగా నష్టపోతున్నామని రైతులు ఆవేదన వ్యక్తం చేశారు. కష్టపడి పండించిన పంట కళ్ల ముందే వృథా అవుతోందని, అప్పులు చేసి సాగు చేసిన తమ పరిస్థితి అగమ్యగోచరంగా మారిందని వాపోయారు. ప్రభుత్వం వెంటనే స్పందించి ఐకేపీ కేంద్రాల్లో ధాన్యం కొనుగోలును తక్షణమే ప్రారంభించాలని, కాంటాలు వేయించి తమను ఆదుకోవాలని డిమాండ్ చేశారు. లేనిపక్షంలో ఆందోళనను మరింత ఉధృతం చేస్తామని రైతులు హెచ్చరించారు.

PULUSU NAGARAJU, SURYAPETA

PULUSU NAGARAJU, SURYAPETA

Next Story