Suryapet: బాధిత కుటుంబానికి అండగా ఉంటాం చైర్మన్ దొంగరి వెంకటేశ్వర్లు

Suryapet: సూర్యాపేటలో అగ్నిప్రమాదంలో దుకాణం కాలిపోయిన బాధిత కుటుంబానికి రూ.62,500 సాయం అందించిన పెరిక కార్పొరేషన్ చైర్మన్ దొంగరి వెంకటేశ్వర్లు, బందు శ్రీధర్ బాబు.

PULUSU NAGARAJU, SURYAPETA
Published on: 22 Oct 2026 10:03 PM IST
Suryapet
X

Suryapet: బాధిత కుటుంబానికి అండగా ఉంటాం చైర్మన్ దొంగరి వెంకటేశ్వర్లు

సూర్యాపేట: సూర్యాపేటకు చెందిన పెరిక కులబంధువు యర్రంశెట్టి ఉపేందర్ దంపతులకు పెరిక కుల సంఘం అండగా నిలిచింది. ఇటీవల జరిగిన అగ్నిప్రమాదంలో వారి కిరాణా దుకాణం పూర్తిగా కాలిపోయి తీవ్ర ఆర్థిక నష్టానికి గురయ్యారు. పండుగ సమయంలో జరిగిన ఈ ఘటనతో కుటుంబం ఇబ్బందుల్లో పడింది.

ఈ విషయం తెలుసుకున్న పెరిక కుల సంఘం నాయకులు స్పందించి, బాధిత కుటుంబానికి మనోధైర్యం కల్పిస్తూ రూ.62,500 ఆర్థిక సహాయాన్ని అందజేశారు. తెలంగాణ రాష్ట్ర పెరిక కుల కార్పొరేషన్ చైర్మన్ దొంగరి వెంకటేశ్వర్లు, సూర్యాపేట జిల్లా పెరిక కుల సంఘం అధ్యక్షుడు బందు శ్రీధర్ బాబు చేతుల మీదుగా ఈ సహాయాన్ని అందించారు.

ఈ సందర్భంగా తెలంగాణ రాష్ట్ర పెరిక కుల కార్పొరేషన్ చైర్మన్ దొంగరి వెంకటేశ్వర్లు మాట్లాడుతూ, అగ్నిప్రమాదంలో నష్టపోయిన ఉపేందర్ కుటుంబాన్ని ఆదుకోవడం అభినందనీయమన్నారు. బాధిత కుటుంబానికి ప్రభుత్వ పరంగా నష్టపరిహారం అందించే అవకాశం ఉంటే సంబంధిత అధికారుల దృష్టికి తీసుకెళ్లి పరిహారం అందేలా కృషి చేస్తానని తెలిపారు. ఆపదలో ఉన్నవారికి అండగా నిలవడం ప్రతి ఒక్కరి బాధ్యత అని పేర్కొన్నారు.

సూర్యాపేట జిల్లా పెరిక కుల సంఘం అధ్యక్షుడు బందు శ్రీధర్ బాబు మాట్లాడుతూ, ఉపేందర్ కుటుంబానికి జిల్లా పెరిక కుల సంఘం ఎల్లప్పుడూ అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు. కష్టకాలంలో కులబంధువులను ఆదుకోవడం సంఘం ప్రధాన బాధ్యత అని, సూర్యాపేట జిల్లా, పట్టణ సంఘాలు సత్వరంగా స్పందించి ఆర్థిక సహాయం అందజేయడం ఐక్యతకు నిదర్శనమని అన్నారు. బాధిత కుటుంబం త్వరగా కోలుకొని వ్యాపారం పునఃప్రారంభించుకోవాలని ఆకాంక్షించారు.

ఈ కార్యక్రమంలో కోదాడ పెరిక హాస్టల్ అధ్యక్షుడు హసనాబాద రాజేష్, జిల్లా గౌరవ అధ్యక్షుడు రామినేని సత్యనారాయణ, జిల్లా అసోసియేట్ అధ్యక్షుడు దొంగరి నాగేశ్వరరావు, జిల్లా ప్రధాన కార్యదర్శి పాయిలి వెంకటనారాయణ, జిల్లా కోశాధికారి ఎర్రంశెట్టి సైదయ్య, పట్టణ గౌరవాధ్యక్షుడు బంధు వీరయ్య, జిల్లా ఉపాధ్యక్షులు నెమ్మని నాగేశ్వరరావు, బెక్కం వెంకటేశ్వర్లు, రాందేని ఆదినారాయణ, జిల్లా నాయకులు తొగరు మల్లికార్జున్, ప్రముఖ రియల్టర్ యర్రంశెట్టి ఉపేందర్, నెమ్మని వెంకటేశ్వర్లు, బుస్సా వీరయ్య, పట్టణ ప్రధాన కార్యదర్శి పోతురాజు నరసయ్య, పట్టణ అసోసియేట్ అధ్యక్షుడు ఎర్రంశెట్టి రామలింగయ్య, కోకాపేట భవన నిర్మాణ కమిటీ సభ్యుడు తిపిరిశెట్టి రాజు, ధర్మపురం సర్పంచ్ దొంగరి లింగస్వామి, పట్టణ సలహాదారు అంకతి వెంకన్న, పట్టణ ప్రముఖులు పిన్నెని మల్లికార్జున్, పిన్నెని శోభన్ బాబు, కొనకంచి శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.

PULUSU NAGARAJU, SURYAPETA

PULUSU NAGARAJU, SURYAPETA