Suryapet: కాంగ్రెస్ పాలనలో డ్రైవర్ల సంక్షేమం గాలికి: జగదీష్ రెడ్డి!

Suryapet: కాంగ్రెస్ ప్రభుత్వం డ్రైవర్ల సంక్షేమాన్ని విస్మరిస్తోందని మాజీ మంత్రి గుంటకండ్ల జగదీష్ రెడ్డి విమర్శించారు. మరణించిన డ్రైవర్ కుటుంబానికి రూ.5 లక్షల బీమా చెక్కు అందజేశారు.

PULUSU NAGARAJU, SURYAPETA
Published on: 27 Aug 2026 6:53 PM IST
Suryapet
X

Suryapet: కాంగ్రెస్ పాలనలో డ్రైవర్ల సంక్షేమం గాలికి: జగదీష్ రెడ్డి!

సూర్యాపేట: కాంగ్రెస్ ప్రభుత్వం డ్రైవర్ల సంక్షేమాన్ని పట్టించుకోవడం లేదని మాజీ మంత్రి, సూర్యాపేట ఎమ్మెల్యే గుంటకండ్ల జగదీష్ రెడ్డి, మాజీ ఎమ్మెల్యే గాదరి కిషోర్ కుమార్ విమర్శించారు. గురువారం జిల్లా కేంద్రంలోని మన్నెం సదాశివారెడ్డి ఫంక్షన్ హాల్ లో బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో 2015లో అప్పటి ముఖ్యమంత్రి కేసీఆర్ డ్రైవర్ల కోసం ప్రవేశపెట్టిన ప్రమాద బీమా పథకం కింద 5 లక్షల బీమా చెక్కును బాధిత కుటుంబానికి అందజేశారు. తుంగతుర్తి నియోజకవర్గం మద్దిరాల మండలం పోలుమల్ల గ్రామానికి చెందిన కొడవలికంటి యాకయ్య కుటుంబ సభ్యులకు బీఆర్టీయూ రాష్ట్ర ఉపాధ్యక్షులు గౌడ్ చర్ల సత్యనారాయణ ఆధ్వర్యంలో ఈ చెక్కును అందించారు.

ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ, డ్రైవర్ల సంక్షేమాన్ని దృష్టిలో ఉంచుకుని బీఆర్ఎస్ ప్రభుత్వం ప్రమాద బీమా పథకాన్ని అమలు చేసిందన్నారు. డ్రైవర్ల కుటుంబాలకు ఆర్థిక భరోసా కల్పించేందుకు ఈ పథకం ఎంతో ఉపయోగపడిందని తెలిపారు. ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వం డ్రైవర్ల సమస్యలను పట్టించుకోకుండా నిర్లక్ష్యం చేస్తోందని ఆరోపించారు. డ్రైవర్ల సంక్షేమం కోసం ప్రభుత్వం తగిన చర్యలు చేపట్టాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో మండల పార్టీ అధ్యక్షుడు రజాక్, గ్రామ శాఖ అధ్యక్షుడు రేసు వెంకన్న, మధు, లింగారెడ్డి, వినోద్, మల్లారెడ్డి, కుటుంబ సభ్యులు తదితరులు పాల్గొన్నారు.

PULUSU NAGARAJU, SURYAPETA

PULUSU NAGARAJU, SURYAPETA

Next Story