Suryapet: దామన్న విగ్రహావిష్కరణ: కన్నీటిపర్యంతమైన వేణారెడ్డి!
Suryapet: సూర్యాపేటలో మాజీ మంత్రి స్వర్గీయ రాంరెడ్డి దామోదర్ రెడ్డి విగ్రహావిష్కరణ ఘనంగా జరిగింది. విగ్రహం ఎదుట మార్కెట్ చైర్మన్ కొప్పుల వేణారెడ్డి కన్నీటిపర్యంతమయ్యారు.
Suryapet: దామన్న విగ్రహావిష్కరణ: కన్నీటిపర్యంతమైన వేణారెడ్డి!
సూర్యాపేట: సూర్యాపేట, తుంగతుర్తి నియోజకవర్గాల మాజీ శాసనసభ్యుడు, మాజీ మంత్రి స్వర్గీయ టైగర్ రామ్ రెడ్డి దామోదర్ రెడ్డి విగ్రహావిష్కరణ మహోత్సవం సూర్యాపేట పట్టణంలోని పబ్లిక్ క్లబ్ ఫంక్షన్ హాల్ లో ఘనంగా నిర్వహించారు.
స్వర్గీయ దామోదర్ రెడ్డికి అత్యంత సన్నిహితుడు, సూర్యాపేట వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ కొప్పుల వేణారెడ్డి ఆధ్వర్యంలో ఈ విగ్రహావిష్కరణ మహోత్సవాన్ని అంగరంగ వైభవంగా ఏర్పాటు చేశారు. మాజీ మంత్రి అభిమానులు, కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో తరలిరావడంతో ప్రాంగణం సందడిగా మారింది.
విగ్రహ ఆవిష్కరణ కార్యక్రమంలో జిల్లా గ్రంథాలయ చైర్మన్ వంగవీటి రామరావు పాల్గొన్నారు. రాష్ట్ర కాంగ్రెస్ నాయకులు, మాజీ ఎంపీటీసీలు, జడ్పీటీసీలు, కౌన్సిలర్లు, సర్పంచులు, ఉపసర్పంచులు, వివిధ స్థాయిల ప్రజాప్రతినిధులు, కాంగ్రెస్ కార్యకర్తలు, దామోదర్ రెడ్డి అభిమానులు పెద్ద ఎత్తున హాజరయ్యారు.
విగ్రహం ముందు భావోద్వేగం: స్వర్గీయ రామ్ రెడ్డి దామోదర్ రెడ్డి విగ్రహం ముందు కొప్పుల వేణారెడ్డి భావోద్వేగానికి గురై కన్నీటిపర్యంతమయ్యారు. తనకు అత్యంత ఆత్మీయుడైన నాయకుడి జ్ఞాపకాలను తలచుకుంటూ కన్నీళ్లు పెట్టుకోవడం అక్కడికి వచ్చిన అభిమానులను సైతం భావోద్వేగానికి గురిచేసింది.
దామన్న మరణం సూర్యాపేట, తుంగతుర్తి నియోజకవర్గాల ప్రజలకు తీరని లోటని వేణారెడ్డి పేర్కొన్నారు. ప్రజలతో మమేకమై నియోజకవర్గాల అభివృద్ధి కోసం పనిచేసిన నాయకుడిగా దామన్నను అభిమానులు స్మరించుకున్నారు.




