Suryapet: సూర్యాపేటలో క్రీడాకారుడు కరుణాకర్ జ్ఞాపకార్థం ఉచిత గుండె పరీక్ష శిబిరం!
Suryapet: సూర్యాపేటలో షటిల్ ప్లేయర్ కరుణాకర్ జ్ఞాపకార్థం ఉచిత గుండె పరీక్ష శిబిరం నిర్వహించిన కౌన్సిలర్ ఊర రామ్మూర్తి యాదవ్. వైద్యులు డా. అలక ప్రేమ్ కుమార్ పరీక్షలు.
Suryapet: సూర్యాపేటలో క్రీడాకారుడు కరుణాకర్ జ్ఞాపకార్థం ఉచిత గుండె పరీక్ష శిబిరం!
సూర్యాపేట: ముందస్తు గుండె పరీక్షలు చేయించుకోవడం ద్వారా ఆరోగ్యాన్ని కాపాడుకోవచ్చని ప్రముఖ వైద్యులు, కౌన్సిలర్ ఊర రామ్మూర్తి యాదవ్ అన్నారు.
జిల్లా కేంద్రంలో ఇటీవల గుండెపోటుతో ఆకస్మికంగా మరణించిన షటిల్ ప్లేయర్ వెలుగు కరుణాకర్ జ్ఞాపకార్థం ఆదివారం ఆయన ఆధ్వర్యంలో ఆర్వీ ఆస్పత్రి యాజమాన్యం సహకారంతో ఉచిత గుండె పరీక్ష శిబిరాన్ని నిర్వహించారు. షటిల్ క్రీడాకారులు, రాజకీయ నాయకులు, జర్నలిస్టులు, పట్టణ ప్రజల కోసం ఈసీజీ, 2డి ఎకో పరీక్షలను ఉచితంగా నిర్వహించారు.
ఈ సందర్భంగా రామ్మూర్తి యాదవ్ మాట్లాడుతూ నిత్యం తమతో కలిసి షటిల్ ఆడుతూ నవ్వుతూ సరదాగా గడిపిన తోటి క్రీడాకారుడు వెలుగు కరుణాకర్ గుండెపోటుతో హఠాన్మరణం చెందడం సహచర క్రీడాకారులను తీవ్ర విషాదానికి గురిచేసిందన్నారు. కళ్లముందే తిరిగిన ఆత్మీయుడు ఇక లేడనే వార్త అందరినీ కలచివేసిందని, ఇలాంటి విషాదకర పరిస్థితి మరే క్రీడాకారుడి కుటుంబంలోనూ చోటుచేసుకోకూడదనే మానవీయ ఆలోచనతో ఈ ఉచిత శిబిరాన్ని ఏర్పాటు చేసినట్లు తెలిపారు. ప్రతి ఒక్కరూ ఆరోగ్యంపై శ్రద్ధ వహించాలని, గుండె సంబంధిత పరీక్షలను నిర్లక్ష్యం చేయవద్దని సూచించారు.
అనంతరం గుండె వైద్య నిపుణులు డా. అలక ప్రేమ్ కుమార్ క్రీడాకారులను పరీక్షించి వారి ఆరోగ్య పరిస్థితిపై తగిన సూచనలు, సలహాలు అందించారు.
ఈ కార్యక్రమంలో ప్రముఖ ఆర్థోపెడిక్ వైద్యులు రమేష్ నాయక్, బార్ అసోసియేషన్ మాజీ అధ్యక్షులు నల్లకుంట్ల అయోధ్య, కొమ్మల వెంకన్న, డా. భట్టు గోపి, బండారు రాజా, సీహెచ్ లింగయ్య, ఆస్పత్రి వైద్య బృందం, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.




