Suryapet: సూర్యాపేటలో పల్స్ పోలియో షురూ.. చిన్నారులకు చుక్కలు వేసిన మున్సిపల్ చైర్మన్ నివేదిత!
Suryapet: సూర్యాపేట ప్రభుత్వ జనరల్ ఆసుపత్రి, మాతా-శిశు ఆరోగ్య కేంద్రంలో పల్స్ పోలియో కార్యక్రమం ఘనంగా ప్రారంభమైంది.
Suryapet: సూర్యాపేటలో పల్స్ పోలియో షురూ.. చిన్నారులకు చుక్కలు వేసిన మున్సిపల్ చైర్మన్ నివేదిత!
సూర్యాపేట: ప్రభుత్వ జనరల్ ఆసుపత్రి (GGH), మాతా-శిశు ఆరోగ్య కేంద్రం (MCH)లో శనివారం పల్స్ పోలియో కార్యక్రమం ఘనంగా ప్రారంభమైంది. మున్సిపల్ చైర్మన్ నివేదిత, వైస్ చైర్మన్ షఫీ ఉల్లా, జిల్లా వైద్య మరియు ఆరోగ్య శాఖాధికారి డా. వెంకటరమణ చిన్నారులకు పోలియో చుక్కలు వేసి కార్యక్రమాన్ని లాంఛనంగా ప్రారంభించారు.
ఈ కార్యక్రమంలో జిల్లా ఇమ్యునైజేషన్ అధికారి డా. కోటి రత్నం, డా. వాసవి, స్టాటిస్టికల్ ఆఫీసర్ బాసిత్‌తో పాటు ఆరోగ్య శాఖ అధికారులు, సిబ్బంది, ప్రెస్ ప్రతినిధులు, చిన్నారుల తల్లిదండ్రులు పాల్గొన్నారు.
ఈ సందర్భంగా అధికారులు మాట్లాడుతూ ఐదేళ్లలోపు ప్రతి చిన్నారికి తప్పనిసరిగా పల్స్ పోలియో చుక్కలు వేయించాలని సూచించారు. పోలియో రహిత భారతదేశాన్ని కొనసాగించేందుకు తల్లిదండ్రులు బాధ్యత వహించాలని పిలుపునిచ్చారు. ఐదేళ్లలోపు ఏ ఒక్క చిన్నారి కూడా పోలియో చుక్కలు మిస్ కాకుండా చూసేందుకు ప్రజలంతా సహకరించాలని విజ్ఞప్తి చేశారు.




