Huzurnagar: హుజూర్‌నగర్‌కు రేపు ‘గిరిజన గళం – తండా నిద్ర’ యాత్ర!
Huzurnagar: భద్రాచలంలో ప్రారంభమైన ‘గిరిజన గళం – తండా నిద్ర’ యాత్ర రేపు హుజూర్‌నగర్ చేరుకోనుంది. చేవెళ్ల గిరిజన డిక్లరేషన్ అమలు చేయాలని నగేష్ రాథోడ్ డిమాండ్ చేశారు.
Huzurnagar: హుజూర్‌నగర్‌కు రేపు ‘గిరిజన గళం – తండా నిద్ర’ యాత్ర!
హుజూర్‌నగర్: గిరిజన హక్కుల సాధన కోసం భద్రాచలం నుంచి అక్టోబర్ 28న ప్రారంభమైన ‘గిరిజన గళం – తండా నిద్ర’ కార్యక్రమం రేపు హుజూర్‌నగర్‌కు చేరుకోనుందని గిరిజన హక్కుల పోరాట సమితి వ్యవస్థాపక అధ్యక్షుడు, న్యాయవాది నగేష్ రాథోడ్ తెలిపారు. పట్టణంలో నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ చేవెళ్ల గిరిజన డిక్లరేషన్‌ను ప్రభుత్వం వెంటనే అమలు చేయాలని డిమాండ్ చేశారు.
గిరిజనుల సమస్యల పరిష్కారం, మైదాన ప్రాంత గిరిజనులకు చట్టసభల్లో తగిన ప్రాతినిధ్యం, తండాల అభివృద్ధి లక్ష్యంగా చేపట్టిన ఈ యాత్రను విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. గిరిజనుల న్యాయమైన డిమాండ్లు నెరవేరే వరకు ఉద్యమం కొనసాగుతుందని ఎల్‌హెచ్‌పీఎస్ జాతీయ కన్వీనర్ వెంకట్రామ్ నాయక్ పేర్కొన్నారు. ఈ సమావేశంలో బీటెక్ సైదా నాయక్, వెంకటేశ్వర్లు నాయక్, నాగరాజు నాయక్ తదితరులు పాల్గొన్నారు.




