Huzurnagar: ట్రాఫిక్ నిబంధనలు పాటించాలి: ఆటో డ్రైవర్లకు ఎస్ఐ హెచ్చరిక!
Huzurnagar: హుజూర్‌నగర్‌లో ట్రాఫిక్‌కు అంతరాయం కలిగించేలా ఆటోలు నిలిపితే చర్యలు తప్పవని ఎస్ఐ నరేష్ హెచ్చరించారు. ప్రతి ఆటోకు ప్రత్యేక నంబర్ కేటాయిస్తామని వెల్లడించారు.
Huzurnagar: ట్రాఫిక్ నిబంధనలు పాటించాలి: ఆటో డ్రైవర్లకు ఎస్ఐ హెచ్చరిక!
హుజూర్‌నగర్: హుజూర్‌నగర్ పట్టణంలో ట్రాఫిక్‌కు అంతరాయం కలిగించేలా ఆటోలు నిలిపితే చట్టపరమైన చర్యలు తీసుకుంటామని ఎస్ఐ నరేష్ హెచ్చరించారు. ఈ సందర్భంగా హుజూర్‌నగర్ పోలీస్ స్టేషన్‌లో ఆటో డ్రైవర్లతో ప్రత్యేక సమావేశం నిర్వహించి ట్రాఫిక్ నియమాలపై అవగాహన కల్పించారు.
బస్టాండ్ ఎదుట, ప్రధాన రహదారులపై ఆటోలను ఇష్టానుసారంగా నిలిపి ప్రయాణికులకు, వాహనదారులకు ఇబ్బందులు కలిగించవద్దని సూచించారు. నిబంధనలు ఉల్లంఘించిన వారిపై కేసులు నమోదు చేయడంతో పాటు జరిమానాలు విధిస్తామని స్పష్టం చేశారు. పట్టణంలోని ఆటోల పూర్తి వివరాలను సేకరించి ప్రతి ఆటోకు ప్రత్యేక నంబర్లు కేటాయించనున్నట్లు తెలిపారు.




