Suryapet: సూర్యాపేటను దేశంలోనే నంబర్ వన్‌గా తీర్చిదిద్దుతాం నివేదిత
Suryapet: సూర్యాపేట 24వ వార్డులో రూ.5 లక్షలతో డ్రైనేజీ పనులకు మున్సిపల్ చైర్పర్సన్ మొరిశెట్టి నివేదిత శంకుస్థాపన. తాగునీటి సమస్యకు శాశ్వత పరిష్కారం హామీ.
Suryapet: సూర్యాపేటను దేశంలోనే నంబర్ వన్‌గా తీర్చిదిద్దుతాం నివేదిత
సూర్యాపేట: సూర్యాపేట మున్సిపాలిటీని అన్ని రంగాల్లో అభివృద్ధి చేసి దేశంలోనే ఆదర్శవంతమైన, నంబర్ వన్ మున్సిపాలిటీగా తీర్చిదిద్దడమే తన లక్ష్యమని సూర్యాపేట మున్సిపల్ చైర్పర్సన్ మొరిశెట్టి నివేదిత లక్ష్యాది అన్నారు.
గురువారం జిల్లా కేంద్రంలోని 24వ వార్డు సీతారాంపురం ప్రాంతంలో మున్సిపల్ సాధారణ నిధుల ద్వారా మంజూరైన రూ.5 లక్షలతో మురికి కాలువ నిర్మాణ పనులకు ఆమె శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా 24వ వార్డు కౌన్సిలర్ మన్నెం అరుణ, మల్లేష్ లు చైర్‌పర్సన్‌కు శాలువాతో ఘన స్వాగతం పలికి సన్మానించారు.
అనంతరం మాట్లాడిన నివేదిత లక్ష్యాది, పట్టణంలోని శివారు ప్రాంతాలతో పాటు అన్ని వార్డులను సమానంగా అభివృద్ధి చేస్తామని తెలిపారు. పర్యావరణ పరిరక్షణకు ప్రాధాన్యం ఇస్తూ పరిశుభ్రమైన, ఆరోగ్యకరమైన సూర్యాపేటను నిర్మించేందుకు మున్సిపాలిటీ నిరంతరం కృషి చేస్తోందని పేర్కొన్నారు.
రానున్న వేసవికాలంలో నీటి ఎద్దడిని నివారించేందుకు దోసపాడు ప్రాజెక్టును త్వరలో పునరుద్ధరించి, సూర్యాపేట ప్రజలకు తాగునీటి సమస్య లేకుండా శాశ్వత పరిష్కారం అందిస్తామని హామీ ఇచ్చారు. సూర్యాపేట సమగ్ర అభివృద్ధికి ప్రజల సహకారం అవసరమని, ప్రతి ఒక్కరూ మున్సిపాలిటీ అభివృద్ధి కార్యక్రమాల్లో భాగస్వాములు కావాలని చైర్పర్సన్ పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ అధికారులు, ప్రజాప్రతినిధులు, వార్డు ప్రజలు తదితరులు పాల్గొన్నారు.




