Suryapet: ఆర్‌ఆర్‌ఆర్ కేంద్రం ప్రారంభం: సూర్యాపేట మున్సిపాలిటీ కీలక నిర్ణయం!
Suryapet: సూర్యాపేట పట్టణ పరిశుభ్రతలో సరికొత్త అడుగు!
Suryapet: ఆర్‌ఆర్‌ఆర్ కేంద్రం ప్రారంభం: సూర్యాపేట మున్సిపాలిటీ కీలక నిర్ణయం!
సూర్యాపేట: పర్యావరణ పరిరక్షణతో పాటు పట్టణ పరిశుభ్రతకు ఆర్‌ఆర్‌ఆర్ కేంద్రాలు ఎంతో ఉపయోగపడతాయని సూర్యాపేట మున్సిపల్ చైర్‌పర్సన్ మొరిశెట్టి నివేదిత లక్షాది అన్నారు. ఉపయోగించిన కానీ ఇంకా పనికొచ్చే వస్తువులను మళ్లీ వినియోగంలోకి తీసుకురావడం ద్వారా చెత్త పరిమాణం తగ్గి ప్రజల్లో అవగాహన పెరుగుతుందని తెలిపారు.మంగళవారం పట్టణంలోనీ మున్సిపల్ షాపింగ్ కాంప్లెక్స్ లో ఏర్పాటు చేసిన ఆర్‌ఆర్‌ఆర్ కేంద్రాన్ని మున్సిపల్ చైర్‌పర్సన్ మొరిశెట్టి నివేదిత లక్షాది ప్రారంభించారు.
ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ఇంటి వద్ద, కార్యాలయాలు, వ్యాపార సంస్థల్లో ఉపయోగించిన, ఇంకా పనికొచ్చే వస్తువులను సేకరించి మళ్లీ వినియోగించేందుకు ఈ కేంద్రాలు దోహదపడతాయని చెప్పారు.పాత బట్టలు, పుస్తకాలు, బొమ్మలు, ప్లాస్టిక్ వస్తువులు, గాజు సీసాలు, లోహ వస్తువులు, పేపర్, ఎలక్ట్రానిక్ వ్యర్థాలు వంటి వస్తువులను ఇక్కడసేకరించి అవసరమైన వారికి అందించవచ్చని తెలిపారు.
దీంతో చెత్త పరిమాణం తగ్గడమే కాకుండా పర్యావరణ పరిరక్షణకు కూడా తోడ్పాటు అందుతుందని పేర్కొన్నారు.వస్తువులను మళ్లీ వినియోగించడం ద్వారా సహజ lవనరుల వినియోగం తగ్గి నీరు, lవిద్యుత్, ముడి పదార్థాల సంరక్షణ సాధ్యమవుతుందని చెప్పారు. అలాగే వ్యర్థాల వర్గీకరణ, నిర్వహణ, పునర్వినియోగ ప్రక్రియల ద్వారా ఉపాధి అవకాశాలు కూడా పెరుగుతాయని తెలిపారు.ప్రజలు తమ ఇళ్లలోనే తడి, పొడి, హానికర వ్యర్థాలను వేరు చేసి అందించాలన్నారు. పనికిరాని చెత్తగా పారేయకుండా మళ్లీ ఉపయోగపడే వస్తువులను ఆర్‌ఆర్‌ఆర్ కేంద్రాలకు అందించాలని కోరారు.స్వచ్ఛ సర్వేక్షణలో మంచి ర్యాంకులు సాధించాలంటే ప్రజల భాగస్వామ్యం కీలకమని పే ర్కొన్న నివేదిత లక్షాది, ప్రతి కాలనీలో పరిశుభ్రతపై అవగాహన పెంచేందుకు మున్సిపాలిటీ ప్రత్యేక చర్యలు చేపడుతుందని తెలిపారు.. ఈ కార్యక్రమములో మున్సిపల్ కమీషనర్ సి. ఎచ్.హన్మంత రెడ్డి,
వార్డు కౌన్సిలర్లు కొణతం రాజేష్, గండూరి రమేష్, డిఇ. సత్యారావు, సానిటరీ ఇన్స్పెక్టర్ సారగండ్ల శ్రీనివాస్, మేనేజర్ బుచ్చి బాబు,జూనియర్ ఆసిటెంట్లు ఎస్. ఎస్. ఆర్. ప్రసాద్, యాదగిరి, అజిముద్దిన్,టీఎంసీ శ్వేత ఎన్విరాన్ మెంట్ ఇంజనీర్ శివప్రసాద్, రంజిత్,రోజా,తదితరులు పాల్గొన్నారు.




