Suryapet: కార్మికుల కష్టానికి దక్కిన గుర్తింపు.. సూర్యాపేటకు ఉత్తమ పర్యావరణ అవార్డు!
Suryapet: సూర్యాపేట మున్సిపాలిటీకి రాష్ట్రస్థాయి ఉత్తమ పర్యావరణ పరిరక్షణ అవార్డు. మున్సిపల్ చైర్పర్సన్ మొరిశెట్టి నివేదితను సన్మానించిన ఆర్యవైశ్య సంఘం.
Suryapet: కార్మికుల కష్టానికి దక్కిన గుర్తింపు.. సూర్యాపేటకు ఉత్తమ పర్యావరణ అవార్డు!
సూర్యాపేట: సూర్యాపేట మున్సిపాలిటీకి రాష్ట్రస్థాయిలో ఉత్తమ పర్యావరణ పరిరక్షణ అవార్డు లభించడం ఎంతో సంతోషంగా ఉందని మున్సిపల్ చైర్పర్సన్ మొరిశెట్టి నివేదిత లక్షాది అన్నారు.
ఆర్యవైశ్య సంఘం పట్టణ అధ్యక్షులు బెలిదె శ్రీనివాసులు ఆధ్వర్యంలో ఆమెను ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ, మున్సిపల్ కార్మికులు ప్రతిరోజు తమ విధులను సక్రమంగా నిర్వహించడం వల్లనే ఈ అవార్డు సాధ్యమైందని పేర్కొన్నారు. అవార్డు వెనుక కార్మికుల కృషి దాగి ఉందని కొనియాడారు.
తాను పదవి చేపట్టిన కొద్ది రోజులకే అత్యుత్తమ పర్యావరణ అవార్డు రావడం గర్వంగా ఉందని చెప్పారు. సూర్యాపేట పట్టణాన్ని పరిశుభ్రంగా ఉంచేందుకు పారిశుద్ధ్య పనులను ప్రతినిత్యం పర్యవేక్షిస్తున్నామని, అన్ని రంగాల్లో పట్టణాన్ని అభివృద్ధి చేస్తామని హామీ ఇచ్చారు.
భవిష్యత్తులో సూర్యాపేట మున్సిపాలిటీకి మరిన్ని అవార్డులు వచ్చేలా ఉత్తమ మున్సిపాలిటీగా తీర్చిద్దేందుకు నిరంతరం కృషి చేస్తామన్నారు. పట్టణ అభివృద్ధిలో సహకరిస్తున్న ప్రతి ఒక్కరికీ ధన్యవాదాలు తెలిపారు.




