Suryapet: డబ్బుల కోసం దారుణం: మరదలిని చంపి.. శ్రీశైలం లోయలో తగలబెట్టిన బావ!

Suryapet: సూర్యాపేట జిల్లాలో దారుణ హత్య వెలుగులోకి వచ్చింది. అప్పు తీర్చమని అడిగిన మరదలిని బావ గోవిందు హత్య చేసి, మృతదేహాన్ని శ్రీశైలం అడవుల్లో 200 అడుగుల లోయలో తగలబెట్టాడు.

PARAMESH, NALGONDA & SURYAPET
Published on: 8 May 2026 7:27 PM IST
Suryapet
X

Suryapet: డబ్బుల కోసం దారుణం: మరదలిని చంపి.. శ్రీశైలం లోయలో తగలబెట్టిన బావ!

సూర్యాపేట: సూర్యాపేట జిల్లాలో దారుణమైన కుటుంబ హత్య కేసు వెలుగులోకి వచ్చింది. బాకీ డబ్బులు అడిగినందుకు సొంత మరదల్నే బావ హత్య చేసిన ఘటన జిల్లాలో సంచలనం సృష్టిస్తోంది. పోలీసుల వివరాల ప్రకారం, అనంతగిరి మండలం మొగులాయి కోట గ్రామానికి చెందిన మహిళ తనకు రావలసిన బాకీ డబ్బుల విషయమై తరచూ అడుగుతుండేది. ఈ విషయం కుటుంబంలో ఉద్రిక్తతకు దారితీసింది. ఇదే ఆగ్రహానికి కారణమై, హుజూర్నగర్ మండలం కాల్వపల్లి గ్రామానికి చెందిన గోవిందు అనే వ్యక్తి తన భార్య మహాలక్ష్మితో కలిసి కుట్ర పన్ని హత్యకు పాల్పడినట్టు సమాచారం.

ఈ ఘటన హుజూర్నగర్ మండలం రాయని గూడెం సమీపంలో జరిగినట్లు తెలిసింది. ముందుగా బాధితురాలిని హత్య చేసిన అనంతరం, మృతదేహాన్ని కారులో తీసుకెళ్లి శ్రీశైలం అడవుల్లోకి తరలించారు. అక్కడ సుమారు 200 అడుగుల లోయలో పడేసి, పెట్రోల్ పోసి మృతదేహాన్ని తగలబెట్టినట్లు పోలీసులు గుర్తించారు. అంతేకాకుండా, హత్య అనంతరం ఎవరికి అనుమానం రాకుండా ఉండేందుకు నిందిత దంపతులు కాశీకి వెళ్లినట్లు తెలుస్తోంది.

ఈ ఘటన సూర్యాపేట జిల్లాలో తీవ్ర కలకలం రేపింది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు కొనసాగిస్తున్నారు. కుటుంబ బంధాలను మరిచి, బాకీ డబ్బుల కోసం జరిగిన ఈ హత్య స్థానికంగా తీవ్ర ఆందోళన కలిగిస్తోంది.

PARAMESH, NALGONDA & SURYAPET

PARAMESH, NALGONDA & SURYAPET

Next Story