Suryapet: పెన్పహాడ్లో రూ.1.84 కోట్లతో బీటీ రోడ్డుకు శంకుస్థాపన!
Suryapet: సూర్యాపేట జిల్లా పెన్పహాడ్ మండలంలో మేఘ్యతండ నుంచి గంగ్లీ తండ వరకు రూ.1.84 కోట్ల ట్రైబల్ నిధులతో నిర్మించనున్న బీటీ రోడ్డు పనులకు శంకుస్థాపన జరిగింది.
Suryapet: పెన్పహాడ్లో రూ.1.84 కోట్లతో బీటీ రోడ్డుకు శంకుస్థాపన!
సూర్యాపేట: పెన్పహాడ్ మండలం మేఘ్యతండ నుంచి గంగ్లీ తండ వరకు రూ.1 కోటి 84 లక్షల వ్యయంతో నిర్మించనున్న బీటీ రోడ్డు నిర్మాణ పనులకు గురువారం శంకుస్థాపన జరిగింది. మేఘ్యతండ గ్రామ సర్పంచ్ భూక్య రాజు నాయక్ ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో తెలంగాణ రాష్ట్ర పర్యాటక అభివృద్ధి సంస్థ మాజీ చైర్మన్ పటేల్ రమేష్ రెడ్డి ముఖ్య అతిథిగా పాల్గొని శంకుస్థాపన చేశారు. ఈ రోడ్డు నిర్మాణానికి ట్రైబల్ ఫండ్ నుంచి నిధులు మంజూరయ్యాయి.
ఈ సందర్భంగా పటేల్ రమేష్ రెడ్డి మాట్లాడుతూ గ్రామీణ ప్రాంతాల అభివృద్ధిలో మెరుగైన రహదారి సౌకర్యాలు కీలక పాత్ర పోషిస్తాయని పేర్కొన్నారు. నాణ్యమైన రహదారుల నిర్మాణం ద్వారా ప్రజలకు సురక్షితమైన, సౌకర్యవంతమైన ప్రయాణ సదుపాయాలు అందుబాటులోకి వస్తాయని తెలిపారు.
ఈ బీటీ రోడ్డు నిర్మాణం పూర్తయితే మేఘ్యతండ, గంగ్లీ తండ గ్రామాల ప్రజలకు రవాణా సౌకర్యాలు మెరుగుపడటంతో పాటు ప్రయాణ సమయం తగ్గి విద్యార్థులు, రైతులు, ఉద్యోగులు, ఇతర ప్రజలకు ఎంతో ప్రయోజనం చేకూరుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు.
గ్రామీణ ప్రాంతాల్లో మౌలిక సదుపాయాల అభివృద్ధికి ప్రాధాన్యతనిస్తూ ప్రజల అవసరాలకు అనుగుణంగా రహదారులు, తాగునీరు, విద్య, వైద్యం వంటి సౌకర్యాలు మరింత మెరుగుపడాలని ఆకాంక్షించారు. గ్రామాల అభివృద్ధి ద్వారానే రాష్ట్ర సమగ్ర అభివృద్ధి సాధ్యమవుతుందని పేర్కొన్నారు.




