Maddiral: రెడ్డిగూడెం పాఠశాలలో విద్యార్థులకు పోలీసుల అవగాహన సదస్సు

Maddiral: మద్దిరాల మండలం రెడ్డిగూడెం పాఠశాలలో పోలీస్ ప్రజా భరోసా అవగాహన కార్యక్రమం నిర్వహించారు.

Muragundla, Veeraiah, Tungathurthy
Published on: 2 Sept 2026 11:23 PM IST
Maddiral
X

Maddiral: రెడ్డిగూడెం పాఠశాలలో విద్యార్థులకు పోలీసుల అవగాహన సదస్సు

మద్దిరాల: సూర్యాపేట జిల్లా తుంగతుర్తి నియోజకవర్గం మద్దిరాల మండలం విద్యార్థులు చట్టాలపై అవగాహన పెంచుకుని, క్రమశిక్షణతో ఉన్నత శిఖరాలను అధిరోహించాలని మద్దిరాల ఎస్ఐ వీరన్న పిలుపునిచ్చారు. బుధవారం రెడ్డిగూడెం ZPHS పాఠశాలలో విద్యార్థులకు ‘పోలీస్ ప్రజా భరోసా’ అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు.

ఈ సందర్భంగా ఎస్ఐ వీరన్న విద్యార్థులను ఉద్దేశించి మాట్లాడుతూ పలు సామాజిక అంశాలపై అవగాహన కల్పించారు. మైనర్లు వాహనాలు నడపరాదని, ప్రతి ఒక్కరూ ట్రాఫిక్ నిబంధనలను తప్పనిసరిగా పాటించాలని సూచించారు. గంజాయి, ఇతర మాదకద్రవ్యాల వినియోగం వల్ల కలిగే అనర్థాలను వివరించి, వాటికి విద్యార్థులు దూరంగా ఉండాలని హెచ్చరించారు.

అలాగే సోషల్ మీడియా వినియోగంలో అప్రమత్తంగా ఉండాలని, గుర్తుతెలియని లింకులను క్లిక్ చేయవద్దని సూచించారు. విద్యార్థినుల రక్షణ కోసం ‘పోలీస్ అక్క’ కార్యక్రమం అందుబాటులో ఉందని, ఎలాంటి వేధింపులు ఎదురైనా భయపడకుండా పోలీసులను సంప్రదించాలని ధైర్యం చెప్పారు.

బాధితులకు త్వరితగతిన న్యాయం అందించేందుకు ప్రవేశపెట్టిన ‘డోర్‌స్టెప్ ఎఫ్‌ఐఆర్’ సేవలపై కూడా విద్యార్థులకు అవగాహన కల్పించారు. చట్టాలపై అవగాహనతో పాటు బాధ్యతాయుతమైన ప్రవర్తన అలవర్చుకోవాలని ఎస్ఐ సూచించారు. ఈ కార్యక్రమంలో పాఠశాల ఉపాధ్యాయులు, పోలీస్ సిబ్బంది, విద్యార్థులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

Muragundla, Veeraiah, Tungathurthy

Muragundla, Veeraiah, Tungathurthy

Next Story