Suryapet: సూర్యాపేటలో ఘనంగా పోలీసు అమరవీరుల సంస్మరణ బైక్ ర్యాలీ!
Suryapet: సూర్యాపేట జిల్లా కేంద్రంలో ఎస్పీ నరసింహ ఆధ్వర్యంలో పోలీసు అమరవీరుల సంస్మరణ బైక్ ర్యాలీ ఘనంగా నిర్వహించారు.
Suryapet: సూర్యాపేటలో ఘనంగా పోలీసు అమరవీరుల సంస్మరణ బైక్ ర్యాలీ!
Suryapet: పోలీసు అమరవీరుల సంస్మరణ కార్యక్రమాలలో భాగంగా మంగళవారం సూర్యాపేట జిల్లా కేంద్రంలో ఎస్పీ నరసింహ ఐపీఎస్ ఆధ్వర్యంలో పోలీసు అమరవీరుల సంస్మరణ బైక్ ర్యాలీ నిర్వహించారు.
ఖమ్మం చౌరస్తా నుంచి ప్రారంభమైన ఈ ర్యాలీ పీఎస్ఆర్ సెంటర్, కల్నల్ సంతోష్ బాబు చౌరస్తా, కోర్టు చౌరస్తా మీదుగా ఎస్వీ ఇంజనీరింగ్ కళాశాల చౌరస్తా వరకు సాగింది. జిల్లా ఎస్పీ నరసింహ ఐపీఎస్ అధికారులతో కలిసి ఖమ్మం చౌరస్తా వద్ద బైక్ ర్యాలీని ప్రారంభించారు. ఎస్వీ కళాశాల వద్ద పౌరులతో కలిసి జై జవాన్, జై కిసాన్, జై పోలీస్ అంటూ నినాదాలు చేసి, అమరవీరులకు ఘనంగా నివాళులర్పించారు. ఈ ర్యాలీలో పట్టణ పౌరులు, యువత ఉత్సాహంగా పాల్గొన్నారు.
ఈ సందర్భంగా ఎస్పీ నరసింహ మాట్లాడుతూ, పోలీసు అమరులు చేసిన త్యాగాలను ప్రతి ఒక్కరూ స్మరించుకోవాలని, పోలీసు త్యాగాలకు గౌరవంగా ప్రతి ఒక్కరూ చట్టపరిధిలో నడుచుకోవాలని సూచించారు. అమరవీరుల త్యాగాలను, పోలీసులు చేసే కఠినతరమైన విధులను ప్రజలకు తెలియజేసే ఉద్దేశంతోనే ఈ కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని తెలిపారు.
ఈ కార్యక్రమంలో అదనపు ఎస్పీ రవీందర్ రెడ్డి, ఆర్మ్డ్ డీఎస్పీ నరసింహ చారి, సీఐలు రాజశేఖర్, వెంకటయ్య, రామారావు, శివకుమార్, ఆర్ఐలు నారాయణ రాజు, ప్రవీణ్ కుమార్, జానయ్య, ఆర్ఎస్ఐ సురేష్, ఎస్ఐలు సందీప్, సాయిరాం, మహేష్, రహీముద్దీన్, కనకరత్నం, పోలీస్ సంఘం అధ్యక్షులు రమేష్, సెక్రెటరీ కిరణ్, యువత, పోలీసు సిబ్బంది పాల్గొన్నారు.




