Suryapet: కొత్త వ్యక్తులపై నిఘా.. సూర్యాపేట పోలీసుల స్పెషల్ డ్రైవ్

Suryapet: సూర్యాపేట పట్టణంలోని లాడ్జీల్లో పోలీసులు అర్ధరాత్రి మెరుపు తనిఖీలు చేపట్టారు.

PULUSU NAGARAJU, SURYAPETA
Published on: 9 May 2026 11:09 AM IST
Suryapet
X

Suryapet: కొత్త వ్యక్తులపై నిఘా.. సూర్యాపేట పోలీసుల స్పెషల్ డ్రైవ్

సూర్యాపేట: అసాంఘిక కార్యకలాపాల నివారణ, అనుమానితులు మరియు కొత్త వ్యక్తుల కదలికలపై నిఘా పెట్టేందుకు సూర్యాపేట పట్టణ పోలీసులు శుక్రవారం అర్ధరాత్రి లాడ్జీల్లో స్పెషల్ డ్రైవ్ నిర్వహించారు. జిల్లా ఎస్పీ నరసింహ ఐపీఎస్ ఆదేశాల మేరకు సూర్యాపేట డివిజన్ డీఎస్పీ ప్రసన్నకుమార్, ఇన్స్పెక్టర్ వెంకటయ్య ఆధ్వర్యంలో ఈ తనిఖీలు చేపట్టారు. పట్టణంలోని అన్ని లాడ్జీలను పోలీసులు క్షుణ్ణంగా పరిశీలించి, అక్కడ బస చేసిన వ్యక్తుల గుర్తింపు పత్రాలను తనిఖీ చేశారు.

వారికి గతంలో ఏమైనా నేర చరిత్ర ఉందా అనే కోణంలోనూ ఆరా తీశారు. ఈ స్పెషల్ డ్రైవ్ ద్వారా కొత్త వ్యక్తుల అనుమానాస్పద కదలికలను అరికట్టవచ్చని డీఎస్పీ ప్రసన్నకుమార్ తెలిపారు. గుర్తింపు లేని వ్యక్తులకు గదులు ఇవ్వొద్దని లాడ్జి యజమానులకు ఆయన సూచించారు. ఒకే వ్యక్తికి ఎక్కువ రోజులు గది కేటాయించకుండా ఉండాలని, ఎవరైనా అనుమానాస్పదంగా కనిపిస్తే వెంటనే పోలీసులకు సమాచారం ఇవ్వాలని కోరారు.

లాడ్జీలు, హోటళ్లను ఆశ్రయంగా చేసుకొని కొందరు దొంగతనాలు, ఇతర నేరాలకు పాల్పడే అవకాశం ఉందని పోలీసులు గుర్తు చేశారు. ఇలాంటి తనిఖీలు కొనసాగిస్తే నేరాల నివారణకు దోహదపడుతుందని స్థానికులు అభిప్రాయపడ్డారు.

PULUSU NAGARAJU, SURYAPETA

PULUSU NAGARAJU, SURYAPETA

Next Story