Suryapet: బాధితుల ఇళ్ల వద్దకే పోలీస్ సేవలు.. సూర్యాపేటలో ‘ఎఫ్ఐఆర్ ఎట్ డోర్ స్టెప్’ సక్సెస్!

Suryapet: సూర్యాపేట జిల్లాలో బాధితుల ఇళ్ల వద్దకే వెళ్లి కేసులు నమోదు చేసే “ఎఫ్ఐఆర్ ఎట్ డోర్ స్టెప్” కార్యక్రమం విజయవంతంగా కొనసాగుతోంది.

PULUSU NAGARAJU, SURYAPETA
Published on: 10 May 2026 7:46 PM IST
Suryapet
X

Suryapet: బాధితుల ఇళ్ల వద్దకే పోలీస్ సేవలు.. సూర్యాపేటలో ‘ఎఫ్ఐఆర్ ఎట్ డోర్ స్టెప్’ సక్సెస్!

సూర్యాపేట: పోలీస్ స్టేషన్ చుట్టూ తిరిగే ఇబ్బంది లేకుండా బాధితుల ఇళ్ల వద్దకే వెళ్లి ఫిర్యాదులు స్వీకరించి కేసులు నమోదు చేసే “ఎఫ్ఐఆర్ ఎట్ డోర్ స్టెప్” కార్యక్రమాన్ని సూర్యాపేట జిల్లా పోలీసులు సమర్థవంతంగా అమలు చేస్తున్నారు.

తెలంగాణ రాష్ట్ర పోలీస్ శాఖ ఆధ్వర్యంలో చేపట్టిన ఈ కార్యక్రమంలో భాగంగా గత వారం రోజుల్లో బాధితుల ఇళ్ల వద్దే 111 కేసులు నమోదు చేసినట్లు సూర్యాపేట జిల్లా ఎస్పీ నరసింహ ఐపీఎస్ తెలిపారు.

మహిళలు, పిల్లలు, వృద్ధులపై దాడులు, రోడ్డు ప్రమాదాలు, దొంగతనాలు, భౌతిక దాడులు, ఎస్సీ-ఎస్టీ అట్రాసిటీ కేసులు, ర్యాగింగ్, బాల్య వివాహాలు వంటి ఘటనల్లో సమాచారం అందిన వెంటనే పోలీసు అధికారులు ఘటనా స్థలానికి లేదా బాధితుల ఇంటికి చేరుకుని ఫిర్యాదు స్వీకరిస్తున్నారు. కేసు నమోదు చేసిన వెంటనే కాపీని బాధితులకు అందజేస్తున్నామని ఎస్పీ వివరించారు.

ఈ ప్రక్రియ ద్వారా పారదర్శకమైన పోలీసు సేవలు అందుతున్నాయని, ప్రజలు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని ఆయన కోరారు. ఏదైనా సమస్య ఉంటే డయల్ 100 లేదా ఫోన్ ద్వారా సమాచారం ఇస్తే చాలు, పోలీసులు నేరుగా వచ్చి కేసు నమోదు చేస్తారని స్పష్టం చేశారు.

PULUSU NAGARAJU, SURYAPETA

PULUSU NAGARAJU, SURYAPETA

Next Story